ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాలో ఏ ఇద్దరి కాంబినేషన్ గురించి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందో తెలుసా? ఒకరు.. తమ విజువల్ మ్యాజిక్‌తో గ్లోబల్ లెవెల్‌లో ఇండియా జెండా ఎగరేసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఇంకొకరు.. తన చరిష్మా, నటనతో కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘వారణాసి’. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే హైప్ మామూలుగా లేదు. అయితే, తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి వచ్చిన ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
రాజమౌళి సినిమాలు అంటేనే క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్, యాక్షన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. 'బాహుబలి', 'ఆర్.ఆర్.ఆర్' సినిమాల్లో క్లైమాక్స్ సీన్స్ చూసి మనమంతా థియేటర్లలో ఈలలు వేశాం కదా! కానీ 'వారణాసి' విషయంలో జక్కన్న అంతకు మించిన ప్లాన్ చేశారట. బరువైన భావోద్వేగాలు, కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, మునుపెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్‌లు అన్నీ కూడా ఈ క్లైమాక్స్‌లోనే పీక్స్‌కు చేరుకుంటాయట. ప్రతి సినిమా అభిమానికి థియేటర్‌లో ఒక మైండ్ బ్లోయింగ్ అనుభూతిని ఇవ్వడమే లక్ష్యంగా రాజమౌళి ఈ సీన్స్‌ను ప్లాన్ చేశారట! మహేష్ బాబు ఇందులో మొదటిసారిగా విభిన్నమైన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి ‘రుద్ర’ కాగా, మరొకటి ‘శ్రీరాముడి’ పాత్ర అని తెలుస్తోంది. మహేష్‌ను ఈ రెండు లుక్స్‌లో చూడటం అభిమానులకు ఐ-ఫీస్ట్ అనడంలో సందేహం లేదు'
ఈ చిత్రంలో ప్రియాంక ‘మందాకిని’ అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు.భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులను తిరగరాస్తూ, సుమారు 1300 కోట్లకు పైగా ఊహించని బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చారు. పవర్‌ఫుల్ డైలాగ్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన దేవా కట్టా మాటలు రాస్తున్నారు. కె.ఎల్. నారాయణ మరియు ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచ స్థాయి విజువల్స్‌తో రాబోతున్న ఈ 'వారణాసి' చిత్రం మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా మరో ఎత్తుకు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.