Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ 90 సెకన్ల టీజర్… రెడీ ఫర్ రిలీజ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తీస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.. అసలు షూటింగ్ ఎప్పుడు ఊపందుకుంది? ఎంత షూటింగ్ అయ్యింది? ఇవేవీ తేలకుండానే ఏకంగా గ్లింప్స్ అంటే ఆల్ మోస్ట్ టీజర్ ని రెడీచేశాడు హరీష్ శంకర్. ఏకంగా 90 సెకన్లతో టీజర్ అంటే ఇక దాన్ని గ్లింప్స్ అనలేం.. కాని గ్లింప్స్ ని మేలో వదలనున్నట్టు లీకులు వదులుతోంది ఫిల్మ్ టీం.

Post Published By: Srikar Creator
Updated : 26 April 2023, 4:30 PM IST

మే 11 నే గబ్బర్ సింగ్ మూవీ వచ్చింది. సో పవన్, హరీష్ కాంబినేషన్ లో వచ్చిన ఆ సెన్సేషనల్ హిట్ మూవీ విడుదలైన రోజే, ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ని రివీల్ చేయబోతోందట ఫిల్మ్ టీం. ఏదో ఇర వై ముప్పై సెకన్ల గ్లింప్స్అంటే ఏదో అనుకోవచ్చు. కాని 90 సెకన్లు అంటే నిమిషమున్నర డ్యూరేషన్ తో టీజర్ అంటే ఫ్యాన్స్ కి పండగనే..

గబ్బర్ సింగ్ లో నాక్కొంచెం తిక్కుంది కాని దానికో లెక్కుంది డైలాగ్ తో అప్పట్లో టీజర్ వదిలినట్టే, ఈ సారి కూడా ఓ సిగ్నేచర్ డైలాగ్ ని చెప్పించాడట హరీష్ శంకర్. దాంతోనే టీజర్ ని కన్ క్లూడ్ చేసేలా యాక్షన్ పార్ట్ తో మొదలు పెట్టి పంచ్ డైలాగ్ తో ఎండ్ అయ్యేలా టీజర్ ని ఎడిట్ చేసినట్టు సమాచారం అందుతోంది.

Published : 
  • 26 April 2023, 4:30 PM IST