PAWAN KALYAN-KRISH: క్రిష్‌లానే ఒక్కొక్క దర్శకుడు సైడ్ అయిపోతున్నాడా?

క్రిష్ ఐదేళ్లుగా హరిహర వీరమల్లు పూర్తి చేయలేక ఫ్రస్ట్రేషన్‌లో ఆ ప్రాజెక్ట్ నుంచే తప్పుకున్నాడు. తన తర్వాత లిస్ట్‌లో హరిష్ శంకర్ ఉన్నాడంటున్నారు. భవదీయుడు భగత్ సింగ్‌ని ప్లాన్ చేసినా తనకి, ఆ ప్రాజెక్ట్ ఆగిపోవటంతో షాక్ కొట్టింది.

Post Published By: narender Thiru
Updated : 12 February 2024, 6:46 PM IST

PAWAN KALYAN-KRISH: పవన్ కళ్యాణ్‌తో సినిమాలు తీస్తే అవి ఫెల్యూర్ టాక్ తెచ్చుకుంటేనే కోటాను కోట్ల వసూళ్లొస్తాయి. యావరేజ్ టాక్ వస్తే వసూళ్ల వరదే. అదే హిట్ టాక్ వస్తే ఇక బాక్సాఫీస్‌లో సునామీనే వస్తుంది. అంత స్టామినాఉన్న స్టార్ కాబట్టే తనతో ఒక్క సినిమా అయినా తీయాలని డైరెక్టర్లు క్యూ కడతారు. అలా క్యూ కట్టిన వాళ్లలో క్రిష్ ఐదేళ్లుగా హరిహర వీరమల్లు పూర్తి చేయలేక ఫ్రస్ట్రేషన్‌లో ఆ ప్రాజెక్ట్ నుంచే తప్పుకున్నాడు.

Jr NTR: హృతిక్, ఎన్టీఆర్ కోసం రెడీ అవుతున్న సిగ్నేచర్ సాంగ్..?

తన తర్వాత లిస్ట్‌లో హరిష్ శంకర్ ఉన్నాడంటున్నారు. భవదీయుడు భగత్ సింగ్‌ని ప్లాన్ చేసినా తనకి, ఆ ప్రాజెక్ట్ ఆగిపోవటంతో షాక్ కొట్టింది. తర్వాత తేరీ రీమేక్ బాధ్యతలు తనకే అప్పచెప్పాక ఉస్తాద్ భగత్ సింగ్‌గా ఆప్రాజెక్ట్ పట్టాలెక్కి వారంరోజులు తెరకెక్కిందో లేదో, తర్వాత మూలకు వెల్లిపోయింది. ఏపీ ఎలక్షన్స్ పూర్తయ్యాక మళ్లీ సెట్లో పవన్ అడుగుపెడతాడనుకునేలోపు ఓజీకి తప్ప మరే సినిమాకు పవన్ నుంచి కాల్ షీట్ల మోక్షం లభించటం కష్టం అంటున్నారు. ఫలితంగానే హరిహర వీరమల్లు నుంచి క్రిష్ బయటికి వెళ్లిపోయాడట.

హరీష్ శంకర్ మీద రూమర్లు పెరగటానికి కూడా అదే కారణం అట. పవన్‌తో సినిమా తీయాలని ఆగి ఆలోచింది హరీష్ శంకర్ చాలా ఏళ్ళు వేస్ట్ చేసుకున్నాడు. తర్వాత రవితేజతో మిస్టర్ బచ్చన్ మొదలు పెట్టాడు. ఇప్పుడు చిరుకి కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. ఇవన్నీ చూస్తే పవన్ దర్శకులు మెల్లిగా పవర్ ఫుల్ కాంపౌండ్ నుంచి బయటికొస్తున్నారని తెలుస్తోంది.

Published : 
  • 12 February 2024, 6:46 PM IST