మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ 'పెద్ది' కలెక్షన్స్ సౌండ్ బాక్సాఫీస్ దగ్గర దద్దరిల్లిపోతోంది. ఏ రేంజ్లో అంటే.. ఏకంగా తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి రికార్డునే బ్రేక్ చేసేంతలా. రామ్ చరణ్ తన యాక్టింగ్‌తో విశ్వరూపం చూపించి జనాలకు పూనకాలు తెప్పిస్తున్న ఈ సినిమా, ఇప్పుడు టాలీవుడ్లో 2026 ఏడాదికి గాను ‘హైయెస్ట్ గ్రాసర్’గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. రిలీజైన కేవలం 10 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ఏకంగా 378 కోట్ల గ్రాస్ రాబట్టి, ట్రేడ్ పండితులకే మతిపోయేలా చేసింది 'పెద్ది' సినిమా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ సుమారు 135 కోట్లు జరగ్గా.. ఆ టార్గెట్‌ను ఈజీగా కొట్టేసి ‘బ్రేక్ ఈవెన్’ కూడా కంప్లీట్ చేసుకుంది. అంటే ఇక అప్పటి నుంచి కలెక్షన్ల రూపంలో వచ్చే ప్రతి రూపాయీ డిస్ట్రిబ్యూటర్లకు లాభాల కిందే లెక్క. డొమెస్టిక్ మార్కెట్ లో కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ అవ్వడం లేదు.
ముఖ్యంగా వీకెండ్స్ లో అయితే థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు అదిరిపోతున్నాయి. నిజానికి ఈ ఏడాది మొదట్లో చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్' సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది. ఈ రికార్డును ఎవరైనా దాటుతారా అనుకుంటే.. చరణ్ తన 'పెద్ది' మూవీతో అలవోకగా క్రాస్ చేసి, తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. అయితే ఇండియాలో కలెక్షన్లతో కుమ్మేస్తున్న 'పెద్ది'.. విదేశాల్లో మాత్రం కాస్త గట్టిగానే చతికిలపడింది. అక్కడ ఈ సినిమాను కొన్న బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవని గట్టిగానే టాక్ వినిపిస్తోంది.
ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 మిలియన్ డాలర్ల పైనే ఉండగా.. ఇప్పటిదాకా 3 మిలియన్ డాలర్లు మాత్రమే రాబట్టింది పెద్ది. అక్కడ కలెక్షన్స్ పూర్తిగా డల్ అయిపోవడంతో, ఈ సినిమా ఓవర్సీస్లో ఫ్లాప్ లిస్ట్‌లో చేరిపోయినట్లేనని సినీ విశ్లేషకులు తేల్చేశారు. ఏది ఏమైనా.. రామ్ చరణ్ పడ్డ కష్టానికి, అతని నట విశ్వరూపానికి ఇక్కడ జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఓవర్సీస్ లో కాస్త డల్ అయినా.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ ఏడాది రికార్డుల రారాజుగా ‘పెద్ది’ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.