Poonam Pandey: బాలీవుడ్‌లో విషాదం.. సర్వైకల్‌ క్యాన్సర్‌తో పూన‌మ్ పాండే మృతి

గర్భాశయ క్యాన్సర్‌తో పూన‌మ్.. శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆమె మేనేజర్ పోస్ట్ చేయడం ఆస‌క్తిక‌రంగా మారింది. పూనమ్ పాండే మరణ వార్త విని బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిన్న మొన్నటి వరకు యాక్టివ్‌గా ఉన్న పూనమ్ ఇప్పుడు సడన్‌గా చనిపోవడం ఏంటా అని అంతా షాక్‌కు గురవుతున్నారు.

Post Published By: narender Thiru
Updated : 2 February 2024, 1:32 PM IST

Poonam Pandey: బాలీవుడ్‌లో విషాదం నెల‌కొంది. బాలీవుడ్ వివాదాస్పద న‌టి పూన‌మ్ పాండే క్యాన్సర్‌తో క‌న్నుమూసింది. గర్భాశయ క్యాన్సర్‌తో పూన‌మ్.. శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆమె మేనేజర్ పోస్ట్ చేయడం ఆస‌క్తిక‌రంగా మారింది. పూనమ్ పాండే మరణ వార్త విని బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిన్న మొన్నటి వరకు యాక్టివ్‌గా ఉన్న పూనమ్ ఇప్పుడు సడన్‌గా చనిపోవడం ఏంటా అని అంతా షాక్‌కు గురవుతున్నారు.

Kannada  : కాంతారలా నాని ఎల్లమ్మ…

పూనమ్ వయసు ప్రస్తుతం 32 ఏళ్లు. పూనమ్ పాండే సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ ఫెమస్ అయ్యింది. బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూనమ్ పాండే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియాతోనే అభిమానులకు టచ్‌లో ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు తరచు పంచుకునే పూనమ్ సడన్‌గా చనిపోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. హీరోయిన్‌గా బాలీవుడ్‌తో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు సినిమాలు చేసింది పూన‌మ్ పాండే. 2013లో న‌షా సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పూన‌మ్ పాండే. ల‌వ్ ఈజ్ పాయిజ‌న్‌, ఆ గ‌యీ హీరోతో పాటు మ‌రికొన్ని సినిమాలుచేసింది. తెలుగులో మాలిని అండ్ కో అనే బోల్డ్ మూవీలో పూన‌మ్ పాండే హీరోయిన్‌గా న‌టించింది.

లాకప్, ఫియ‌ర్ ఫాక్టర్ వంటి మ‌రికొన్ని హిందీ రియాలిటీ షోస్‌లో కంటెస్టెంట్‌గా పూన‌మ్ పాండే పాల్గొంది. ఇప్పుడు పూనమ్ మరణ వార్తపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. పూనమ్ నిజంగానే కన్నుమూసిందా లేక ఏదైనా ప్రచారంలో భాగంగా ఇలా పోస్ట్ చేశారా.. ఇంతకీ పూనమ్ ఇప్పుడు ఎక్కడ ఉంది అనే విషయాలు సస్పెన్స్‌గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

Published : 
  • 2 February 2024, 1:32 PM IST