Prabhas : ఫౌజీ గా ప్రభాస్-హను రాఘవపూడి సినిమా

సలార్‌ (Salar) సినిమాలో ఊరమాస్ అవతార్‌లో కనిపించిన ప్రభాస్ (Prabhas).. నెక్స్ట్ రిలీజ్‌కు రెడీ అవుతున్న కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) సినిమాలో కల్కి అవతార్‌లో కనిపించనున్నాడు. మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ సినిమాలో డార్లింగ్‌గా ఎంటర్టైన్ చేయనున్నాడు. ఇక సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ (Spirit) సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా భయపెట్టనున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 13 April 2024, 9:00 AM IST

 

 

సలార్‌ (Salar) సినిమాలో ఊరమాస్ అవతార్‌లో కనిపించిన ప్రభాస్ (Prabhas).. నెక్స్ట్ రిలీజ్‌కు రెడీ అవుతున్న కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) సినిమాలో కల్కి అవతార్‌లో కనిపించనున్నాడు. మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ సినిమాలో డార్లింగ్‌గా ఎంటర్టైన్ చేయనున్నాడు. ఇక సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ (Spirit) సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా భయపెట్టనున్నాడు. ఇక ఆ తర్వాత హనురాఘవపూడి సినిమాలో సైనికుడుగా కనిపించేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. హను రాఘవపూడి సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఉందా లేదా అనే డౌట్స్ ఉండేవి. కానీ తాజాగా హను రాఘవపూడి ఈ ప్రాజెక్ట్‌ను కన్ఫామ్ చేశాడు.

రీసెంట్‌గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హను.. ప్రభాస్‌తో పీరియాడిక్ యాక్షన్ జానర్‌లో సినిమా చేస్తున్నట్లు వెల్లడించాడు. అలాగే.. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే మూడు పాటలు కూడా కంపోజ్ చేసినట్లు హను రాఘవపూడి తెలిపారు. దీంతో ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా.. సైలెంట్‌గా ఈ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయనే చెప్పాలి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు టైటిల్ కూడా లాక్ అయినట్టుగా చెబుతున్నారు. ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం. ఫౌజీ అంటే సైనికుడు. రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని.. స్వాతంత్య్రం రాక ముందు రజాకార్‌ నేపథ్యంలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అందుకే.. ఫౌజీ టైటిల్ అనుకున్నట్టు తెలుస్తోంది.

Published : 
  • 13 April 2024, 9:00 AM IST