చూస్తే చూడు లేదంటే లేదు…!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'మౌనరాగం' వంటి సీరియల్స్ ద్వారా తెలుగింటి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముంబై బ్యూటీ, బిగ్ బాస్ తెలుగు సీజన్-7తో మరింత పాపులర్ అయింది.

Post Published By: dialnews
Updated : 27 April 2026, 7:15 PM IST

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'మౌనరాగం' వంటి సీరియల్స్ ద్వారా తెలుగింటి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముంబై బ్యూటీ, బిగ్ బాస్ తెలుగు సీజన్-7తో మరింత పాపులర్ అయింది. అయితే, కెరీర్ ఆరంభంలో సాంప్రదాయబద్ధంగా కనిపించిన ప్రియాంక, బిగ్ బాస్ తర్వాత తన స్టైల్‌ను మార్చడంతో సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్‌కు గురైంది. తాజాగా ఆమె పాత ఇంటర్వ్యూ క్లిప్ ఒకటి వైరల్ అవుతుండగా, ఈ ట్రోల్స్‌పై ఆమె స్పందించిన తీరు చర్చనీయాంశమైంది. ముంబై నుంచి వచ్చిన ప్రియాంక జైన్ అతి తక్కువ కాలంలోనే తెలుగు టీవీ రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకుంది. 'అమ్మాయిలు', 'మౌనరాగం' వంటి సీరియల్స్‌లో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బిగ్ బాస్ తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. షోలు, ఈవెంట్స్, ఓటీటీ ప్రాజెక్టులతో బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ఆమె తన డ్రెస్సింగ్ స్టైల్‌ను కూడా మార్చుకుంది.

"బిగ్ బాస్ తర్వాత నా కెరీర్ మారింది, అందుకే నా స్టైల్ కూడా మారింది. అంతకుముందు నేను కేవలం సీరియల్స్‌లో మాత్రమే కనిపించేదాన్ని. ఇప్పుడు రకరకాల ప్రాజెక్టులు చేస్తున్నాను. అప్పటి ప్రియాంక వేరు.. ఇప్పటి ప్రియాంక వేరు. ఇది నా స్టైల్, నా ఐడెంటిటీ" అని ఆమె స్పష్టం చేసింది. ఒక డ్యాన్స్ షోలో ఆమె ధరించిన దుస్తులపై నెటిజన్లు దారుణమైన కామెంట్లతో విరుచుకుపడ్డారు. ఈ విషయంపై ప్రియాంక ఒక టాక్ షోలో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది."ఆ ట్రోల్స్ చూసి నేను నిజంగా షాక్ అయ్యాను. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం నా మీద పడిపోయినట్టు అనిపించింది. అంత మంది అసభ్యకరమైన కామెంట్లు చేస్తారని నేను ఊహించలేదు. కొన్ని కామెంట్లు చదివాక నాపై నాకే అసహ్యం వేసింది. అసలు నేను ఏం తప్పు చేశాను? అని అనిపించింది" అంటూ తన ఆవేదనను పంచుకుంది.

తన డ్రెస్సింగ్‌పై వస్తున్న విమర్శలకు ప్రియాంక ఘాటుగానే సమాధానం ఇచ్చింది. తాను ఒక నటినని, పాత్రకు తగ్గట్టుగా ఒక లుక్ ఉంటుందని, కానీ వ్యక్తిగత జీవితంలో కూడా అలాగే ఉండాలని కోరుకోవడం సరికాదని పేర్కొంది. ప్రతి అమ్మాయికి తనదైన స్టైల్ ఉంటుంది. కొత్తగా కనిపించాలని ప్రయత్నించడం తప్పు కాదు, నచ్చకపోతే అన్‌ఫాలో చెయ్యండి.. అంతేకానీ బూతులు తిట్టడం పద్ధతి కాదు అని ప్రియాంక సెలవిచ్చింది. సెలబ్రిటీలు కూడా మనుషులేనని, ట్రోలింగ్ వల్ల వారు ఎంతగా బాధపడతారో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రస్తుతం నెటిజన్లలో కూడా మార్పు కనిపిస్తోంది. "డ్రెస్సుపై కాదు, టాలెంట్‌పై మాట్లాడాలి" అంటూ చాలా మంది ప్రియాంకకు మద్దతుగా నిలుస్తున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది అనే వాదనలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రమయ్యాయి.

Published : 
  • 27 April 2026, 7:15 PM IST