RAM CHARAN: చరణ్ వర్సెస్ బన్నీ.. ఇప్పట్లో ఈ కోల్డ్ వార్‌కి బ్రేక్ లేదా..?

పుష్ప 2లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్ వేసేలా బన్నీ ప్లాన్ చేశాడట. ఇది సుకుమార్‌కి కూడా నచ్చి అటువైపుగా అడుగులేశారట. అక్కడే మెగా పవర్‌స్టార్ ఫైర్ అయ్యాడని తెలుస్తోంది. ఎందుకంటే గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత బుచ్చి బాబు మేకింగ్‌లో రామ్ చరణ్ చేయబోయే సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూరే.

Post Published By: narender Thiru
Updated : 19 September 2023, 6:51 PM IST

RAM CHARAN: రామ్ చరణ్ వర్సెస్ బన్నీ అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉందంటారు. మెగా హీరోలంతా ఒకటే అని బయటికి చెప్పినా చెర్రీ, బన్నీ మధ్య గ్యాప్ ఉందనే మాటే ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. లేటెస్ట్‌గా చెర్రీ హీరోయిన్‌తో బన్నీ చిందేసే ఐడియా వెనక ఇలాంటి కోల్డ్ వారే ఉందంటున్నారు. పుష్ప 2లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్ వేసేలా బన్నీ ప్లాన్ చేశాడట. ఇది సుకుమార్‌కి కూడా నచ్చి అటువైపుగా అడుగులేశారట.

అక్కడే మెగా పవర్‌స్టార్ ఫైర్ అయ్యాడని తెలుస్తోంది. ఎందుకంటే గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత బుచ్చి బాబు మేకింగ్‌లో రామ్ చరణ్ చేయబోయే సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూరే. సో.. ఆ సినిమా ఇప్పుడు మొదలైనా, ఎప్పుడొస్తుందో చెప్పలేం. ఎంతలేదన్నా కనీసం ఆ ప్రాజెక్ట్ మొదలై రావాలంటే, ఏడాది పడుతుంది. ఈలోపు ఆగస్ట్ 15న పుష్ప 2 వస్తుంది. అందులో జాన్వీ కపూర్ ఐటమ్ గాల్‌గా కనిపిస్తే, ఇక ఆతర్వాత చరణ్‌తో కలిసి సినిమా చేసినా ఆ క్యూరియాసిటీ ఉండే ఛాన్స్ లేదు. ఆల్రెడీ దేవరలో తారక్‌తో జోడీకట్టిన జాన్వీతో చరణ్ సినిమా అంటే సర్లే.. శ్రీదేవి, చిరంజీవిలా కాంబినేషన్ అదుర్స్ అంటున్నారు. అలా కూడా అనుకోకుండా, పుష్ప 2లోనే జాన్వీ ఐటమ్ బాంబు విసిరితే, ఇక చరణ్‌తో తన జోడీకి విలువుండదు అంటున్నారు.

ఈ విషయంలో బుచ్చి బాబు మీద చరణ్ ఫైర్ అవటం, తను తన గురువు సుకుమార్‌ని కలవటం, జాన్వీ ఐటమ్ సాంగ్ విషయంలో చిన్న డిస్ట్రబెన్స్ రావటం జరిగిందట. ఇంకా ఏదీ.. ఎటూ తేలలేదంటున్నారు. అసలే ఆగస్ట్ 15ని గేమ్ ఛేంజర్ రిలీజ్ చేయాలనుకుంటే, ఆడేట్‌ని పుష్ప 2 కి ఎనౌన్స్ చేసి చరణ్‌కి కోపం వచ్చేలా చేశాడు బన్నీ అంటున్నారు. ఇప్పుడు దానికి ఇది తోడైందనే కామెంట్లే వినిపిస్తున్నాయి.

Published : 
  • 19 September 2023, 6:51 PM IST