రష్మిక వివాదం యశ్ సమాధానం.!

కన్నడ చిత్రపరిశ్రమ నుంచి వచ్చి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్, ఇటీవల రజత్ శర్మ నిర్వహించిన 'ఆప్ కీ అదాలత్' టాక్ షోలో పాల్గొని పలు కీలక విషయాలను పంచుకున్నారు. తన రాబోయే చిత్రం టాక్సిక్ ప్రమోషన్స్

Post Published By: dialnews
Updated : 17 August 2026, 7:10 PM IST

కన్నడ చిత్రపరిశ్రమ నుంచి వచ్చి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్, ఇటీవల రజత్ శర్మ నిర్వహించిన 'ఆప్ కీ అదాలత్' టాక్ షోలో పాల్గొని పలు కీలక విషయాలను పంచుకున్నారు. తన రాబోయే చిత్రం టాక్సిక్ ప్రమోషన్స్ మరియు కెరీర్ విశేషాల గురించి మాట్లాడే క్రమంలో, 2017 నాటి ఒక పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రముఖ కథానాయకి రష్మిక మందన్న తన గురించి చేసిన వ్యాఖ్యలపై యష్ చాలా పరిణతితో, స్పష్టంగా స్పందించారు. ఈ వివాదం కన్నడ ఇండస్ట్రీలో 2017లో మొదలైంది. రష్మిక మందన్న నటించిన 'కిరిక్ పార్టీ' చిత్రం విడుదల సమయంలో ఓ ఛానెల్‌లో ఒక ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూలోని "రాపిడ్ ఫైర్" రౌండ్‌లో రష్మికను ఒక ప్రశ్న అడిగారు. "కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మిస్టర్ షోఆఫ్ ఎవరు? అని. దానికి రష్మిక ఏమాత్రం ఆలోచించకుండా యష్ పేరును సమాధానంగా చెప్పారు.

దాంతో యష్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సోషల్ మీడియాలో రష్మికపై భారీ స్థాయిలో ట్రోలింగ్, విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో రష్మిక మందన్న వెంటనే సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ స్పష్టత ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ 'కిరిక్ పార్టీ' విడుదల కంటే 7 నెలల ముందే షూట్ చేశారని, అది ఒక సరదా రాపిడ్ ఫైర్ రౌండ్ మాత్రమేనని చెప్పారు. షోలోని అత్యంత సరదా భాగాన్ని ఎడిట్ చేసి, కేవలం రెండు లైన్లను మాత్రమే హైలైట్ చేయడం వల్ల సందర్భం మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యష్ సర్ అంటే తనకు ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని, ఆయన ప్రతిభ తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని స్పష్టం చేశారు. ఆయనపై తనకు ఎలాంటి దురభిప్రాయం లేదని తెలిపారు. వివాదం ముదురుతున్న సమయంలో యష్ కూడా తన అభిమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

తన ఫ్యాన్స్ ఎవరూ రష్మికను వ్యక్తిగతంగా దూషించవద్దని, ఆ విషయాన్ని అక్కడితో వదిలేయాలని కోరారు."నాకు రష్మిక వ్యక్తిగతంగా తెలియదు, ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఆమెకు తన అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని మార్చలేవు" అని వ్యాఖ్యానించారు.అంతేకాకుండా, ఎవరిపైనా వ్యక్తిగత దాడులు చేయడం అభిమానం అనిపించుకోదని తన అభిమానులకు హితవు పలికారు. ఇటీవల రజత్ శర్మ షోలో ఈ పాత సంఘటన గురించి మళ్లీ ప్రశ్నించగా, యష్ ఎంతో సముచితంగా సమాధానమిచ్చారు.
ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నదో నాకు తెలియదు.

అప్పట్లో ఆమె పరిశ్రమకు కొత్త. ఇలాంటి టీవీ షోలలో యాంకర్లు 3, 4 ఆప్షన్లు ఇస్తారు. కొత్తగా వచ్చినవారు ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాలని భావిస్తారు. ఆ వ్యాఖ్యల వల్ల చాలామంది డైరెక్టర్లు నొచ్చుకున్నారు. కానీ వ్యక్తిగతంగా నాకు అది పెద్ద విషయంగా అనిపించలేదు.ఎవరైనా నా గురించి ఎలాంటి అభిప్రాయమైనా వ్యక్తపరచవచ్చు. కానీ ఒకరి అభిప్రాయం నా వ్యక్తిత్వాన్ని, నా ఉనికిని మార్చలేదు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను అని చెప్తూ, పాత వివాదాలను త్రవ్వితీసి ఎవరినీ తప్పుబట్టడానికి యష్ ఇష్టపడలేదు. టీవీ షోల ఫార్మాట్ వల్లనే ఇంటర్వ్యూలు పాల్గొనేవారు సరదాగా త్వరితగతిన సమాధానాలు ఇస్తుంటారని, దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం యష్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'టాక్సిక్' పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ వ్యాఖ్యలతో యష్ తన గొప్ప మనసును, పరిణతి చెందిన ఆలోచనా విధానాన్ని మరోసారి నిరూపించుకున్నారు.

Published : 
  • 17 August 2026, 7:10 PM IST