భారతీయ చలనచిత్ర రంగంలో విలక్షణమైన ముద్ర వేసిన దర్శకుల్లో ఒకరు సందీప్ రెడ్డి వంగా. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన ఈ దర్శకుడు, తన ఇన్స్పిరేషన్ గురించి ఎప్పుడూ కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంటారు.