జర్నలిస్ట్ టూ బెంజ్ కార్…!

సినీ పరిశ్రమలో రాణించాలంటే కేవలం అదృష్టం ఉంటే సరిపోదు, వెనుక ఉండి నడిపించే స్నేహితులు, ప్రోత్సహించే వ్యక్తులు ఉండాలి. టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న SKN

Post Published By: dialnews
Updated : 2 April 2026, 11:50 AM IST

సినీ పరిశ్రమలో రాణించాలంటే కేవలం అదృష్టం ఉంటే సరిపోదు, వెనుక ఉండి నడిపించే స్నేహితులు, ప్రోత్సహించే వ్యక్తులు ఉండాలి. టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న SKN తాజాగా తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. 'మనం ఎవరి వల్ల ఎదిగామో అన్నది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒకప్పుడు జర్నలిస్ట్‌గా పని చేసిన SKN, అప్పట్లో నెలకు కేవలం 2700 రూపాయల జీతానికి పని చేసేవారట. ఆ సమయంలో సాధారణ మధ్యతరగతి జీవితం గడుపుతూ, కేవలం స్విఫ్ట్, ఆల్టో వంటి చిన్న కార్ల గురించి మాత్రమే తెలిసిన తనకు, ఈరోజు లగ్జరీ బెంజ్ కార్ కొనుక్కునే స్థాయికి చేర్చింది తన స్నేహితులేనని ఆయన కృతజ్ఞతగా చెప్పుకొచ్చాడు. SKN ఎదుగుదలలో దర్శకులు మారుతి మరియు సాయి రాజేష్ కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నాడు. ముఖ్యంగా 'బేబీ' సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సాయి రాజేష్ తనకు చిన్నప్పటి నుండి స్నేహితుడని, తనను నిర్మాతగా నిలబెట్టడంలో సాయి రాజేష్ కృషి ఎంతో ఉందని వెల్లడించాడు.

మారుతి గారు తనను గుర్తించి ప్రోత్సహించగా, సాయి రాజేష్ తన వెన్నంటే ఉండి ముందుకు నడిపించారని ఆయన తెలిపాడు. మనం ఎవరి వల్ల ఎదిగామో అన్నది ఎప్పుడూ చెప్పుకోవాలి" అని SKN అన్న మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని చాటుతున్నాయి. చిన్న జీతంతో మొదలై, నేడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా ఎదగడం వెనుక ఎంతో కష్టం, అంతకు మించి నమ్మకమైన స్నేహితుల అండ ఉందని ఈ సందర్భంగా స్పష్టమవుతోంది.ప్రస్తుతం SKN మరియు సాయి రాజేష్ కాంబినేషన్‌లో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. వీరిద్దరి స్నేహం ఇలాగే కొనసాగుతూ మరిన్ని అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Published : 
  • 2 April 2026, 11:50 AM IST