Pawan : పవన్ కళ్యాణ్ సినిమాని ఆపండి…

తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ హడావుడి ఒక రేంజ్ లో ఉంటుంది. రీ రిలీజ్ కి కూడా అదే పరిస్థితి.. ఎలాంటి మార్పు ఉండదు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 29 April 2024, 11:22 AM IST

 

 

తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ హడావుడి ఒక రేంజ్ లో ఉంటుంది. రీ రిలీజ్ కి కూడా అదే పరిస్థితి.. ఎలాంటి మార్పు ఉండదు. కానీ ఇప్పుడు మా అభిమాన హీరో సినిమాని ఆపండని అంటున్నారు. పైగా వాళ్లెవరో కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

పవన్ (Pawan Kalyan) పార్టీ పెట్టినపుడు అభిమానుల్లో మెదిలిన ప్రశ్న ఒక్కటే. పవన్ సినిమాలు చేస్తాడా లేదా అని. వారి ఆశలు ఫలించి వకీల్ సాబ్ (Vakil Saab) తో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ మూవీ మే ఫస్ట్ న రీ రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మూవీని రిలీజ్ చెయ్యద్దని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. పైగా అందుకు కారణాన్ని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం పవన్ పొలిటికల్ పరంగా బిజీగా ఉంటూ తమకి కావాల్సిన కిక్ ఇస్తున్నాడని ఈ మూమెంట్ అలాగే ఉండాలని కోరుకుంటున్నారు.

2021 లో వచ్చిన వకీల్ సాబ్ లో పవన్ ఆడవారి తరుపున పోరాడే లాయర్ పాత్రల్లో సూపర్ గా నటించాడు. ప్రకాష్ రాజ్ (Prakash Raj), అంజలి (Anjali), నివేదిత థామస్, అనన్య నాగళ్ళ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం అసెంబ్లీ నుంచి పవన్ పోటీ చేస్తున్నాడు. మరో వైపు కూటమికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాడు. ఈ టైంలో ఏది ఏమైనా పవన్ ఫ్యాన్స్ రీ రిలీజ్ వద్దనడం ఆసక్తిని కలిగిస్తుంది. మరి మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Published : 
  • 29 April 2024, 11:22 AM IST