సుహాస్ అదిరే తమిళ్ ఎంట్రీ.!

యువ నటుడు సుహాస్ 'మండాడి' సినిమాతో సెప్టెంబర్ 10న తమిళ రంగప్రవేశం చేయబోతున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా పాజిటివ్ పాత్రలు చేసిన ఆయన, ఈ చిత్రంలో మాత్రం పూర్తిగా భిన్నమైన వైల్డ్ విలన్ పాత్రను పోషిస్తున్నారు

Post Published By: dialnews
Updated : 4 September 2026, 5:15 PM IST

యువ నటుడు సుహాస్ 'మండాడి' సినిమాతో సెప్టెంబర్ 10న తమిళ రంగప్రవేశం చేయబోతున్నారు.
ఇప్పటివరకు ఎక్కువగా పాజిటివ్ పాత్రలు చేసిన ఆయన, ఈ చిత్రంలో మాత్రం పూర్తిగా భిన్నమైన వైల్డ్ విలన్ పాత్రను పోషిస్తున్నారు.
కథ నచ్చడం మరియు విలన్ పాత్రకు మంచి స్కోప్ ఉండటంతో తను కోలీవుడ్ ఎంట్రీకి ఇదే సరైన సినిమా అని భావించారు.
షూటింగ్ సమయంలో సూరి చాలా కేరింగ్‌గా చూసుకుంటూ, ఇంటిలో ఉన్న ఫీలింగ్ కలిగించారని సుహాస్ ఎంతో సంతోషంగా గుర్తు చేసుకున్నారు.

అంతేకాకుండా అందరికీ మంచి ఫుడ్ పెట్టించడంతో పాటు సెట్‌ను ఎప్పుడూ సరదాగా ఉంచేవారని సూరి గురించి ఆయన ప్రశంసించారు.
ఈ ప్రాజెక్ట్‌కి వెట్రిమారన్ నిర్మాతగా ఉండటం మరో అదనపు ప్లస్ అని, సినిమా చూశాక ఆయన గెటప్స్‌ను మెచ్చుకున్నారని సుహాస్ తెలిపారు.
ఈ సినిమాలో సముద్రంలో తీసిన క్లైమాక్స్ భాగం షూటింగ్ దాదాపు 45 రోజుల పాటు జరిగిందని, అదే పెద్ద ఛాలెంజ్ అని చెప్పారు.

కొన్ని రిస్క్‌లు ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుని, మొత్తం సినిమా కోసం తను 130 రోజుల పాటు పని చేసినట్లు వెల్లడించారు.
తన కెరీర్‌లో ఇంత పెద్ద బడ్జెట్ చిత్రంలో నటించడం ఇదే తొలిసారి కావడంతో ఆ అనుభవం కొత్తగా అనిపించిందని అన్నారు.
ఐదు భాషల రిలీజ్ కోసం ఈ చిత్రం వాయిదా పడిందని మరియు మొదటి షోకే డబ్బింగ్ వెర్షన్లు రాలేదని తెలుస్తోంది. విభిన్నమైన అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Published : 
  • 4 September 2026, 5:15 PM IST