స్వయంభు టీజర్ రివ్యూ.. నిఖిల్ వార్ మోడ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజువల్స్..!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మరో విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పీరియడ్ యాక్షన్ సినిమా స్వయంభు టీజర్ తాజాగా విడుదలైంది

Post Published By: dialnews
Updated : 12 February 2026, 10:55 AM IST

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మరో విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పీరియడ్ యాక్షన్ సినిమా స్వయంభు టీజర్ తాజాగా విడుదలైంది. ఇప్పటివరకు నిఖిల్ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా, ఒక అన్-టోల్డ్ ఇండియన్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. టీజర్ రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియాలో దీనిపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. టీజర్ చూస్తుంటేనే సినిమా ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో అర్థమవుతోంది. విజువల్స్ చాలా రిచ్ గా, అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా టీజర్ లో చూపించిన లొకేషన్స్, సెట్ వర్క్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. పీరియడ్ బ్యాక్ డ్రాప్ కు తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని టీజర్ స్పష్టం చేస్తోంది. ప్రతి ఫ్రేమ్ లోనూ మేకర్స్ పడిన కష్టం కనిపిస్తోంది.

ఈ సినిమాలో నిఖిల్ మేకోవర్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక యోధుడిగా నిఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ పాత్ర కోసం నిఖిల్ శారీరకంగా చాలా మార్పులు చేసుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది. చేతిలో ఆయుధం పట్టి, యుద్ధరంగంలోకి దూకే వీరుడిగా నిఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్ సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయి. కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లుక్ లో నిఖిల్ కనిపిస్తున్నాడు.
రాజ్యం కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ప్రజలకు అండగా నిలబడే ఒక వీర యోధుడి కథాంశంతో ఈ సినిమా రాబోతోంది. ధర్మాన్ని కాపాడే క్రమంలో హీరో చేసే పోరాటం ఆసక్తికరంగా ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ మరియు నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీళ్ళ పాత్రలు కూడా కథలో కీలకంగా ఉంటాయని టీజర్ ద్వారా హింట్ ఇచ్చారు.

మొత్తానికి స్వయంభు టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకునే కంటెంట్ ఇందులో ఉందని అర్థమవుతోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద నిఖిల్ మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేస్తారని, ఈ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. స్పై సినిమా తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్నాడు నిఖిల్. మధ్యలో అప్పుడో ఇప్పుడో ఎపుడో అనే ఒక సినిమా వచ్చింది కానీ అది ఎప్పుడు వచ్చి వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ప్రస్తుతానికి మనోడి ఫోకస్ మొత్తం స్వయంభు మీదే ఉంది.

Published : 
  • 12 February 2026, 10:55 AM IST