Bigg Boss 7 : నాగార్జునకు షాక్ .. బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ గా బాలకృష్ణ ?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో  ( Telugu Biggest Live Reality Show ) బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్లు మరియు ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తిచేసుకుంది. మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) హోస్ట్ చేయగా రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 3 November 2023, 4:39 PM IST

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో  ( Telugu Biggest Live Reality Show ) బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్లు.. ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తిచేసుకుంది. మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) హోస్ట్ చేయగా రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని ( Nani ) హోస్ట్ గా వ్యవహరించారు. అయితే బిగ్ బాస్ ( Bigg Boss  ) మూడవ సీజన్ నుంచి సీజన్ 7 వరకు టాలీవుడ్ కింగ్ నాగార్జున నే బిగ్ బాస్ కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది నాగార్జున హోస్టింగ్ చాలా బాగుంటుందని అంటుండగా మరికొందరు మాత్రం బోర్ గా ఉంటుందని కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ నెక్ట్స్ సీజన్ కోసం మాత్రం బిగ్ బాస్ టీం ఈసారి వేరే సీనియర్ హీరోని సంప్రదించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ ( Balakrishna ).

Elvish Yadav: రేవ్ పార్టీలో పాము విషం.. బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్‌‌పై కేసు..

అన్ స్టాపబుల్ ( Unstoppable ) టాక్ షో తో బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగానే అలరిస్తున్న బాలకృష్ణ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ కి హోస్ట్ గా కూడా వ్యవహరించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటిదాకా ఎన్టీఆర్, నాని మరియు నాగార్జునకి కూడా ఇవ్వనంత పారితోషికం బిగ్ బాస్ బృందం బాలయ్య కి ఆఫర్  చేయనున్నట్లుగా తెలుస్తోంది.

Chandrababu Naidu : చంద్రబాబుని KTR, KCR కలుస్తారా.. ?

అయితే ఈ షో ఒప్పుకోవడానికి బాలకృష్ణ కొన్ని కండిషన్లు కూడా పెట్టారట. అందులో భాగంగానే బిగ్ బాస్ స్టేజ్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వేరే చోటికి మార్చబోతున్నట్లు సమాచారం. ఏదేమైనా అన్ స్టాపబుల్ షో తో బాలకృష్ణ ఫేమ్ బాగానే పెరిగింది. ఈ సమయంలో బాలయ్య బిగ్ బాస్ కి హోస్టుగా వ్యవహరిస్తే ప్రతి సీజన్ కి పడిపోతూ వస్తున్న బిగ్ బాస్ రేటింగ్ లు కూడా విపరీతంగా పెరుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. చూడాలి మరి.

Published : 
  • 3 November 2023, 4:39 PM IST