Vijay Thalapathy: అమ్మ కోసం గుడి.. హీరోకి ఫ్యాన్స్ సలాం..

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో హీరోగా నిలిచాడు విజయ్ దళపతి. తమిళనాట విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విజయ్ నటించిన సినిమాలు భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి.

Post Published By: narender Thiru
Updated : 12 April 2024, 7:42 PM IST

Vijay Thalapathy: ‘అమ్మను మించిన దైవమున్నాదా.. ఆత్మను మించి అర్థమున్నదా..’ అని ఓ కవి రాశారు. కన్నవారికి చరమ దశలో పిడికెడు అన్నం పెట్టని ఎందరి గురించో చూస్తున్నాం. వృద్ధాశ్రమాల్లో చేరిన అభాగ్యుల కథలూ వింటున్నాం. కానీ కని పెంచి, తమ ఉన్నతికి శ్రమించిన అమ్మకు ఆలయం కట్టించాడు తమిళ్ హీరో. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో హీరోగా నిలిచాడు విజయ్ దళపతి. తమిళనాట విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

PAWAN KALYAN: OG సెన్సేషన్.. ఏకంగా అన్ని భాషల్లో రిలీజ్.. మరో ఖుషి అవుతుందా..?

ఇటీవల విజయ్ నటించిన సినిమాలు భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. సినిమా రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా అవలీలగా వందల కోట్లను వసూల్ చేస్తున్నాయి. ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు విజయ్. ప్రస్తుతం విజయ్ గోట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే విజయ్ తన తల్లి కోసం గుడి కట్టించారని జోరుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ తన తల్లి దండ్రులతో కలిసి ఉండటం లేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఆయన తల్లి శోభా అంటే చాలా ఇష్టం. ఇందుకు నిదర్శనంగా ఆయన ఓ గుడిని కట్టించారట.

చెన్నైలోని స్థానిక కొరట్టూర్‌లో తన తల్లికి ఇష్టమైన సాయి బాబా కోసం ఆలయాన్ని నిర్మించాడట విజయ్. ఫిబ్రవరి నెలలో ఈ ఆలయంలో కుంభాభిషేకం కూడా జరిగిందట.. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే అమ్మ కోసం విజయ్ గుడి కట్టించారన్న వార్త విన్న ఫ్యాన్స్ హీరో చేసిన పనికి ఫిదా అవుతున్నారు.
https://www.youtube.com/watch?v=Oqwl6Li9iow

Published : 
  • 12 April 2024, 7:42 PM IST