గాంధీ జయంతికి తలపతి విజయ్ కొడుకు ఎంట్రీ.!

స్టార్ హీరో తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మొదటి సినిమా 'సిగ్మా'. మామూలుగా ఒక పెద్ద స్టార్ హీరో కొడుకు అనగానే అందరూ అతడు హీరోగానే ఎంట్రీ ఇస్తాడని అనుకుంటారు.

Post Published By: dialnews
Updated : 19 August 2026, 11:55 AM IST

స్టార్ హీరో తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మొదటి సినిమా 'సిగ్మా'. మామూలుగా ఒక పెద్ద స్టార్ హీరో కొడుకు అనగానే అందరూ అతడు హీరోగానే ఎంట్రీ ఇస్తాడని అనుకుంటారు. కానీ జేసన్ సంజయ్ మాత్రం కెమెరా ముందుకు రాకుండా, కెమెరా వెనక నిలబడి యాక్షన్-కట్ చెప్పడానికే మొగ్గు చూపాడు. తన మొదటి సినిమాతోనే ఒక వైవిధ్యమైన కథతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ 'సిగ్మా' సినిమాలో ఎనర్జిటిక్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తుండగా, అతని సరసన గ్లామరస్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా అలరించనుంది. దక్షిణాదిలో ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని చాలా అట్టహాసంగా నిర్మిస్తోంది. అంతేకాకుండా ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాజు సుందరం కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు.

ఈ సినిమాను నిజానికి ఈ ఏడాది జూలై 31న గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, సరిగ్గా దానికి వారం రోజుల ముందు జూలై 23న తమిళ స్టార్ విజయ్ నటించిన 'జన నాయిగన్' సినిమా రిలీజ్ కావడంతో, బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడటం ఇష్టం లేక 'సిగ్మా' విడుదలను మేకర్స్ వాయిదా వేశారు.ఇన్నాళ్లూ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ ఒక తీపి కబురు చెప్పారు! గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకోస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. జేసన్ సంజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేయడం మాకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. ఇది అతనికి మొదటి సినిమా అయినప్పటికీ, పని పట్ల అతనికి ఉన్న స్పష్టత, విజన్, క్రమశిక్షణ చూస్తుంటే ఒక సీనియర్ అనుభవజ్ఞుడైన దర్శకుడిలా అనిపించింది.

సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం సహా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పనిచేసారు అని లైకా సంస్థ ప్రొడక్షన్ హెడ్ తెలిపారు.ఒక కొత్త దర్శకుడి విజన్‌ను నమ్మడం చాలా గొప్ప విషయం. నన్ను నమ్మి, పూర్తి సృజనాత్మక స్వేచ్ఛను ఇచ్చిన మా నిర్మాతలు సుభాస్కరన్ సర్, జి.కె.ఎం. తమిళ కుమరన్ సర్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంస్థకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి ప్రోత్సాహం వల్లే నేను అనుకున్న కథను, అనుకున్న విధంగా పర్ఫెక్ట్‌గా తెరకెక్కించగలిగాను అని దర్శకుడు జేసన్ సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. సందీప్ కిషన్ మాస్-ఎనర్జిటిక్ యాక్టింగ్, జేసన్ సంజయ్ మేకింగ్ విజన్, లైకా ప్రొడక్షన్స్ భారీ తారాగణం... ఇవన్నీ కలిసి 'సిగ్మా' సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. విజయ్ కొడుకుగా కాకుండా ఒక స్వతంత్ర దర్శకుడిగా జేసన్ సంజయ్ తన ముద్రను ఎలా వేయబోతున్నాడో చూడటానికి సినీ అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

Published : 
  • 19 August 2026, 11:55 AM IST