నాచురల్ స్టార్ నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' సినిమానుంచి 'ఆయా షేర్' సాంగ్ లిరికల్ వీడియో వచ్చేసింది. "దసరా లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత, నాచురల్ స్టార్ నాని మరియు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న 'ది ప్యారడైజ్' నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ అదరగొట్టేసింది. నాని పుట్టినరోజైన ఫిబ్రవరి 24 సందర్భంగా విడుదలైన 'ఆయా షేర్' పాట ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇది కేవలం పాట మాత్రమే కాదు, నాని 'మాస్ రాంపేజ్' అని చెప్పాలి. సెన్సేషనల్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ పాటలో తన మార్క్ 'హై-వోల్టేజ్ బీట్స్' క్లియర్ గా కనిపిస్తున్నాయి. అద్దుల జంగిరెడ్డి, ఆకునూరి దేవయ్య మరియు అనిరుధ్ స్వయంగా ఈ పాటను పాడారు.
వీరి వాయిస్ సాంగ్‌కు ఒక రకమైన 'రా అండ్ రగ్గడ్' ఫీల్ తీసుకొచ్చింది. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం హీరో క్యారెక్టర్ ఎలివేషన్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది.సాంగ్‌లో ముఖ్యంగా నాని లుక్ అదిరిపోయింది. ముఖ్యంగా రెండు జడల గెటప్‌లో నాని చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాడు. ఇది ఒక ట్రైబల్ కమ్యూనిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ అని అర్థమవుతోంది. సుధాన్ మాస్టర్ కొరియోగ్రఫీలో వందలాది మంది డ్యాన్సర్లతో కలిసి నాని వేసిన మాస్ స్టెప్పులు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం. 'దసరా'లో ధరణి పాత్రను మించి ఇందులో జడల్ 'మాస్ ఎనర్జీ' కనిపిస్తోంది.
ఈ సినిమా ఒక వెనకబడిన గిరిజన తెగ తమ హక్కుల కోసం చేసే పోరాటం అని తెలుస్తోంది. అందులో నాని ఒక పవర్‌ఫుల్ లీడర్‌గా కనిపిస్తాడు. సినిమాలో మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. అలాగే రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి వంటి నటులు కూడా ఉన్నారు. ది పారడైజ్ మూవీ ముందుగా మార్చిలో అనుకున్నప్పటికీ, క్వాలిటీ కోసం మేకర్స్ ఈ సినిమాను ఆగస్టు 21, 2026న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు."అనిరుధ్ మ్యూజిక్ + శ్రీకాంత్ ఓదెల టేకింగ్ + నాని యాక్టింగ్.. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర ఈసారి వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం గ్యారెంటీగా కనిపిస్తోంది.