నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమా బిజినెస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాగా 'ది ప్యారడైజ్' తెరకెక్కబోతోంది."దసరా వంటి మాస్ హిట్ తర్వాత నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాపై అంచనాలు ఒక్కో అప్డేట్ చూస్తుంటే ఆకాశాన్ని తాకుతున్నాయి."కేవలం తెలుగులోనే కాదు, ఏకంగా 8 భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మొదట 100-150 కోట్లు అనుకున్న ఈ సినిమా బడ్జెట్, విజువల్స్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ కోసం ఇప్పుడు 200 కోట్లు దాటినట్లు సమాచారం.
నాని గత చిత్రాలతో పోలిస్తే ఇది అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్. ఇది ఆయన మార్కెట్ స్టామినాకు దక్కిన గుర్తింపుగా మారుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ పోటీ పడింది. దాదాపు 60 కోట్ల నుండి 75 కోట్ల మధ్య ఈ డీల్ క్లోజ్ అయినట్లు టాక్. ఇది నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ OTT డీల్.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో, ఆడియో రైట్స్ కూడా భారీ ధరకే అమ్ముడయ్యాయి. 'ఆయా షేర్' సాంగ్ ఇప్పటికే హై లెవెల్ హైప్ క్రియేట్ చేసింది. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి రావాలంటే థియేటర్ల ద్వారా సుమారు 175 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. విలన్‌గా సీనియర్ నటుడు మోహన్ బాబు, రాఘవ్ జుయల్ వంటి నటులు ఉండటం సినిమాకు పాన్-ఇండియా లెవల్లో బిజినెస్ పెరగడానికి కారణమైంది.