spirit : ‘స్పిరిట్’ లో ముగ్గురు హీరోయిన్లు…

అర్జున్ రెడ్డి (Arjun Reddy) నుంచి ‘యానిమల్’ (Animal) వరకూ తన సినిమాల ప్రొడక్షన్ విషయంలో చాలా ఎక్కువ సమయమే తీసుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా...

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 April 2024, 1:25 PM IST

అర్జున్ రెడ్డి (Arjun Reddy) నుంచి ‘యానిమల్’ (Animal) వరకూ తన సినిమాల ప్రొడక్షన్ విషయంలో చాలా ఎక్కువ సమయమే తీసుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అయితే.. ఇప్పుడు ప్రభాస్ తో చేయబోయే ‘స్పిరిట్’ను మాత్రం జెట్ స్పీడులో కంప్లీట్ చేయడానికి ప్రణాళిక రెడీ చేస్తున్నాడట. ఈ సినిమాని సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నాడు.

లేటెస్ట్ గా ‘స్పిరిట్’ (Spirit) మూవీలో హీరోయిన్ ఎంపికపై కసరత్తులు జరుగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సినిమాల్లో హీరోతో పాటు హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా.. తన మూవీస్ లో హీరోయిన్స్ ను చాలా రొమాంటిక్ గా చూపిస్తుంటాడు. ఇప్పుడు ప్రభాస్ కోసం ముగ్గురు భామలను షార్ట్ లిస్ట్ చేశాడట

ప్రభాస్ కటౌట్ కు తగ్గ బ్యూటీలను దింపేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నాడట వంగా. ఇప్పటి వరకు ప్రభాస్ తో జతకట్టని హీరోయిన్లను తీసుకోవాలనుకుంటున్నాడట. పైగా ట్రెండింగ్ లో ఉన్న ముద్దుగుమ్మల కోసం సెర్చ్ చేస్తున్నాడట. అయితే రష్మిక, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మృణాల్ ఠాకూర్ మాత్రం హను రాఘవపూడితో ప్రభాస్ చేసే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందనే ప్రచారం ఉంది. ఒకవేళ మృణాల్.. ప్రభాస్-హను మూవీకి కమిట్ అయితే మాత్రం కీర్తి సురేష్ కానీ, రష్మికని కానీ.. ‘స్పిరిట్’లో నాయికగా ఫైనలైజ్ చేయనున్నాడట సందీప్ రెడ్డి వంగా.

Published : 
  • 1 April 2024, 1:25 PM IST