టాక్సిక్ బుకింగ్స్ ఓపెన్ తెలుగు వెర్షన్ హవా!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Post Published By: dialnews
Updated : 12 August 2026, 5:50 PM IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో యష్ సరసన బాలీవుడ్, సౌత్ భామలు నటిస్తూ సినిమాపై మరింత క్రేజ్ పెంచేస్తున్నారు. కియారా అద్వానీ, రుక్మిణీ వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి హీరోయిన్లుగా నటిస్తుండగా, వర్సటైల్ యాక్ట్రెస్ నయనతార మరో కీలకమైన, శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇంతమంది స్టార్ నటీనటులు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

తాజాగా యూఎస్ మార్కెట్‌లో ఈ సినిమా ప్రీమియర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అక్కడి ట్రెండ్స్ చూస్తే రాకింగ్ స్టార్ యష్‌కి ఉన్న పాన్ ఇండియా క్రేజ్ మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. విశేషమేమిటంటే, ఈ బుకింగ్స్‌లో తెలుగు వెర్షన్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.
కన్నడ, తెలుగు భాషల్లో యూఎస్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా, ప్రస్తుతం తెలుగు వెర్షన్‌కే భారీగా బుకింగ్స్ జరుగుతూ లీడ్‌లో కనిపిస్తోంది. రాకింగ్ స్టార్ యష్‌కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విపరీతమైన మాస్ ఫాలోయింగ్‌కు ఇది నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్ సెంటర్స్ లో కూడా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా టికెట్ల కోసం పోటీ పడుతుండటంతో, 'టాక్సిక్' చిత్రం తెలుగులో భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ విజువల్ వండర్‌ను రాకింగ్ స్టార్ యష్ స్వయంగా 'కే వి ఎన్ ప్రొడక్షన్స్' సంస్థతో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఫైనల్ సేల్స్ సమయానికి ఏ వెర్షన్ అత్యధిక వసూళ్లు రాబడుతుందో చూడాలి కానీ, ప్రస్తుతానికి మాత్రం తెలుగు వెర్షన్ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ఈ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

Published : 
  • 12 August 2026, 5:50 PM IST