నా అ*మొగుడంటే అవకాశాలు రావు…!

యానిమల్' సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన త్రిప్తి దిమ్రి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. అయితే అది కేవలం తన సినిమాల వల్ల కాదు..

Post Published By: dialnews
Updated : 28 February 2026, 3:10 PM IST

యానిమల్' సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన త్రిప్తి దిమ్రి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. అయితే అది కేవలం తన సినిమాల వల్ల కాదు.. ఆమెపై జరుగుతున్న ఒక నెగటివ్ PR క్యాంపెయిన్ వల్ల!అక్టోబర్ 2024లో త్రిప్తి తన సినిమా 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' ప్రమోషన్స్ కోసం జైపూర్‌కు వెళ్లారు. ఈ ఈవెంట్ ను జైపూర్‌కు చెందిన ఒక పారిశ్రామికవేత్తల యూనియన్ నిర్వహించింది. అయితే, త్రిప్తి ఆ ఈవెంట్‌కు వస్తానని చెప్పి 5.5 లక్షల రూపాయలు తీసుకుందని, కానీ చివరి నిమిషంలో రాకుండా హ్యాండ్ ఇచ్చిందని నిర్వాహకులు ఆరోపించారు.

ఆ తరువాత, కోపంతో ఉన్న మహిళా నిర్వాహకులు త్రిప్తి పోస్టర్లకు నల్ల రంగు పూస్తూ, ఆమెను 'బాయ్‌కాట్' చేయాలని పిలుపునిచ్చిన వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. ఈ వివాదం ముదరడంతో త్రిప్తి దిమ్రి టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. త్రిప్తి కేవలం తన సినిమా ప్రమోషన్లకు సంబంధించి మాత్రమే జైపూర్‌కు వెళ్లారని, ఈ పర్సనల్ ఈవెంట్‌కు వస్తానని ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదని స్పష్టం చేశారు. అలాగే, ఎవరి దగ్గరా ఎటువంటి అదనపు డబ్బులు తీసుకోలేదని తేల్చి చెప్పారు. త్రిప్తి వరుసగా పెద్ద ప్రాజెక్టులు దక్కించుకోవడంతో, ఆమె ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి కావాలనే కొందరు 'నెగటివ్ PR' చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

గతంలో 'ఆషికీ 3' నుండి ఆమెను తొలగించారని, ఆమెకు సరైన లుక్స్ లేవని కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అయ్యాయి. దీనిపై త్రిప్తి స్పందిస్తూ.. "ఎంత నెగటివిటీ ఉన్నా, నాకు ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రేమే ముఖ్యం" అని ఒక పోస్ట్ పెట్టారు. రీసెంట్‌గా దీపికా పదుకొనేపై జరుగుతున్న నెగటివ్ PRను ఎండగడుతూ వచ్చిన ఒక పోస్ట్‌ను త్రిప్తి లైక్ చేయడం కూడా సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అంటే ఆమె కూడా ఇలాంటి వేధింపులు అనుభవిస్తోందని అర్థం చేసుకోవచ్చు. జైపూర్ ఈవెంట్ విషయంలో తప్పు ఎవరిదో పక్కన పెడితే, త్రిప్తికి మాత్రం వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మరి త్రిప్తి దిమ్రి, ప్రభాస్ కాంబినేషన్ ఎలా ఉండబోతోందో కామెంట్ చేయండి.

Published : 
  • 28 February 2026, 3:10 PM IST