దళపతి విజయ్ సీఎం అవ్వడమేంటో కానీ హీరోయిన్ త్రిష ఏం చేసినా అది వైరల్ అవుతూనే ఉంది. రీసెంట్‌గా త్రిష తన రెమ్యూనరేషన్ 12 కోట్లుకు పెంచడంపై ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చే నడిచింది. ఇదిలా కంటిన్యూ అవుతుండగానే చెన్నైలో ఏకంగా 10 కోట్లు విలువ చేసే లగ్జరీ విల్లాను కొనుగోలే చేసి మరో టాపిక్‌కు తెర లేపింది త్రిష. చెన్నైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన, రిచ్ ఏరియా అయిన ఈస్ట్ కోస్ట్ రోడ్.. ECR ప్రాంతంలో 10 కోట్ల విలువైన లగ్జరీ విల్లాను కొనుగోలు చేసింది త్రిష. అయితే ఇక్కడ నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తున్న అంశం ఏమిటంటే.. ఈ ఇల్లు సీఎం విజయ్ ఇంటికి చాలా దగ్గరగా ఉండటం. నీలాంకరైలోని విజయ్ ఇంటికి త్రిష కొత్త ఇంటికి మధ్య దూరం కేవలం 5 నుండి 7 కిలోమీటర్ల లోపే ఉంటుందని టాక్. దీంతో వీరిద్దరి ఇళ్ల దూరంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
ఈ సరికొత్త ఇంటిని త్రిష తన అభిరుచులకు అనుగుణంగా పూర్తిగా మోడరన్ అండ్ క్లాసిక్ స్టైల్‌లో డిజైన్ చేయించుకుంది. ప్రకృతికి దగ్గరగా ఉండేలా ఇండోర్ ప్లాంట్స్, మినిమలిస్టిక్ ఇంటీరియర్ థీమ్‌ను ఎంచుకుంది. ఇంట్లోనే ఒక అత్యాధునిక మినీ హోమ్ థియేటర్, జిమ్, ఆమె పెంచుకునే పెట్స్ కోసం ప్రత్యేకమైన ప్లే ఏరియాను కూడా డిజైన్ చేయించింది. ప్రశాంతమైన వాతావరణం కోసం సముద్ర తీరం కనిపించేలా ఈ ఇంటి బాల్కనీలను రూపొందించారు. చెన్నైలో త్రిషకు ఇదివరకే సొంత ఇల్లు ఉంది. చెన్నైలోని ఆల్వార్‌పేట్ పరిసరాల్లో తన తల్లితో కలిసి ఉండే పాత ఇల్లు దాదాపు 6 నుండి 7 కోట్ల వరకు విలువ చేస్తుంది. ఇది కాకుండా, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కొన్ని ఖరీదైన ఫ్లాట్స్, కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.
ఆమె మొత్తం ఆస్తుల విలువ దాదాపు 80 నుండి 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గతంలో ఒక్కో సినిమాకు 4 నుండి 5 కోట్ల వరకు డిమాండ్ చేసిన త్రిష.. 'పొన్నియిన్ సెల్వన్', 'లియో' చిత్రాల తర్వాత తన మార్కెట్‌ను విపరీతంగా పెంచేసుకుంది. తాజాగా విజయ్ సీఎం కావడంతో పాటు కోలీవుడ్‌లో ఆమె క్రేజ్ పీక్స్‌కు చేరడంతో, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న రజనీకాంత్ - కమల్ హాసన్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కోసం త్రిష ఏకంగా 12 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే, సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో త్రిష అగ్రస్థానంలో నిలుస్తుంది. విజయ్ సీఎం అయిన కొన్ని రోజులకే త్రిష 10 కోట్లతో ఇల్లు కొనడం, 12 కోట్లకు రెమ్యునరేషన్ పెంచడంపై సోషల్ మీడియాలో మీమ్స్, గాసిప్స్ వెల్లువలా వస్తున్నాయి. విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడం వెనుక త్రిష సెంటిమెంట్ ఉందంటూ, ఆమె ఇటీవల విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఎమోషనల్ వీడియోల వల్ల నెటిజన్లు వీరిద్దరి పాత లవ్ రూమర్స్‌ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు నెటిజన్లు.