సినిమా స్టార్స్ పెళ్లి అనగానే ప్రతీ ఒక్కటి ఇంటరెస్టింగ్ గానే కనపడుతుంది. ఇప్పుడు రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ పెళ్లి ఇలాగే ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తుంది. రాజుల కాలాన్ని గుర్తు చేస్తూ అదిరిపోయే రేంజ్ లో పెళ్లి చేసుకుంది ఈ జంట. తెలుగు వాడైన విజయ్ దేవరకొండ కోసం తెలుగు సాంప్రదాయంలో.. కొడగు అమ్మాయి కావడంతో రష్మిక మంధన కోసం కొడవ సాంప్రదాయంలో ఈ వివాహం జరిగింది. పెళ్ళికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ డిస్కషన్ కు డోర్స్ ఓపెన్ చేసింది. ఒక్కసారి వారి జ్యూవేలరి, వస్త్రాల గురించి ఓ లుక్ వేద్దాం.
దక్షిణ భారత సాంప్రదాయ వివాహ దుస్తులు, పురాతన ఆలయ ఆభరణాలతో స్వర్గంలో జరిగినట్లుగా ఓ రేంజ్ లో కనిపించారు ఈ జంట. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వివాహం కోసం హైదరాబాద్‌కు చెందిన శ్రీ జ్యువెలర్స్ ఆభరణాలు తయారు చేసింది. ఇందులో కాసుల మాల, పాము గొలుసులు, వంకీలు నుండి సాధారణ గొలుసులు, ఒడ్డాణం వరకు ఉన్నాయి. సెలబ్రిటీ జ్యువెలరీ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రియాంషు గోయెల్ వారి ఆభరణాల గురించి రాస్తూ.. అతని చేతిపై ఉన్న వంకీ నుండి నడుము చుట్టూ ఉన్న ఒడ్డాణం వరకు చాలా సింపుల్ గా అందంగా తీర్చిదిద్దారని రాసుకొచ్చారు.
అతని మెడలోని కాసు మాల, హరామ్ నుండి కడుక్కన్, గోలుసు వరకు అన్నీ మన సంస్కృతిలో భాగం కాదట. కేవలం ఫ్యాషన్ కోసమే వాటిని రెడీ చేసారని, రాజుల కాలం నాటి రోజుల మాదిరిగా వివాహం చేసుకున్నారని గోయెల్ చెప్పుకొచ్చాడు. ఇక రష్మిక మందన్న.. టూ లేయర్డ్ బంగారు నెక్లెస్ లు, ఆలయ శైలిలో ఉండే లాకెట్టు, భారీ ఝుమ్కాలు, ఆమె జడలో జడ బిళ్ళ, షోల్డర్ చైన్ లు.. వంటివి సౌత్ ఇండియా పెళ్లిని కళ్ళ ముందు ఉంచాయి. వజ్రాలు గానీ, ఆధునిక స్టైలింగ్ ట్రిక్స్ గానీ ఇందులో లేవు. కేవలం బంగారం, ఆచారాలు, వారసత్వం వంటివి చూపించారు.