తెలుగు, తమిళ చలనచిత్ర పరిశ్రమల్లో తనదైన నటనతో, వైవిధ్యమైన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ ప్రీతి అస్రాని. రీసెంట్‌గా విడుదలైన ‘29’ అనే సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ భామ, ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా కోలీవుడ్ లో వరుస ఆఫర్లను అందుకుంటూ అక్కడ స్టార్ హీరోయిన్‌గా మారేందుకు అడుగులు వేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచింది.తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్ నిర్మిస్తున్న ఒక సరికొత్త భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో ప్రీతి అస్రాని కథానాయికగా ఎంపికైంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విక్కీ భాస్కర్, కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్కూల్ నుండి వచ్చిన వ్యక్తి. 'ఖైదీ', 'మాస్టర్', 'విక్రమ్', 'లియో' వంటి ఇండస్ట్రీ హిట్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్ వద్ద విక్కీ భాస్కర్ అసోసియేట్‌గా పనిచేశారు. లోకేష్ మార్క్ యాక్షన్, స్క్రీన్ ప్లే టేకింగ్ ఈ దర్శకుడిలోనూ కనిపిస్తుందని, అందుకే ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా ఒక డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాకు చిత్రబృందం ఒక విభిన్నమైన, క్యాచీ టైటిల్‌ను ఖరారు చేసింది. ‘ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో’ అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేసినట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ టైటిల్ వినడానికి చాలా డిఫరెంట్‌గా, కాస్త ఫన్నీగా ఉన్నప్పటికీ, సినిమా కథకు ఇది పక్కాగా సరిపోతుందని ఇండస్ట్రీ టాక్.
టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. టైటిల్ ప్రకటనతో పాటు చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. పోస్టర్‌ను డిజైన్ చేసిన విధానం చూస్తుంటే ఇదొక విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీగా వచ్చే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. విష్ణు విశాల్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎంచుకునే కథలు, నిర్మించే సినిమాలు ఎప్పుడూ వైవిధ్యంగా ఉంటాయి. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ శిష్యుడి దర్శకత్వంలో, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రలో వస్తున్న ‘ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో’ సినిమా ఖచ్చితంగా ఇటు తమిళంతో పాటు అటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.