హాలిడేస్ మూడ్ బ్యాండ్ మేళం…!

కోర్ట్' సినిమాతో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న యంగ్ హీరో హర్ష్ రోషన్, క్యూట్ బ్యూటీ శ్రీదేవి అపల్లా మళ్ళీ జంటగా వస్తున్నారు.

Post Published By: dialnews
Updated : 6 March 2026, 1:55 PM IST

'కోర్ట్' సినిమాతో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న యంగ్ హీరో హర్ష  రోషన్, క్యూట్ బ్యూటీ శ్రీదేవి అపల్లా మళ్ళీ జంటగా వస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ గారు సమర్పిస్తున్న లేటెస్ట్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ 'బ్యాండ్ మేళం'. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే, బ్యాండ్ మేళం' సినిమా రిలీజ్ డేట్ గురించి గత కొన్ని రోజులుగా చాలా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మేకర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ అఫీషియల్ గా డేట్ అనౌన్స్ చేశారు.

ఈ సినిమా మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. మార్చి చివరి వారం అంటే ఎగ్జామ్స్ అయిపోయే టైమ్, అలాగే సమ్మర్ హాలిడేస్ మూడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ ఈ డేట్‌ని ఫిక్స్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మరియు సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.

బేబీ' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. 'తిప్పుకుంటున్నావ్' సాంగ్ ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ గారు ఈ సినిమాకి సాహిత్యం అందించడం విశేషం. ఈ సినిమాలో సీనియర్ నటుడు సాయి కుమార్ గారు ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ 'కోర్ట్' సినిమాలో ఎలాగైతే వర్కవుట్ అయిందో, ఇందులో కూడా అంతకంటే బాగా కుదిరిందని ఇన్ సైడ్ టాక్. ఒక చక్కని మ్యూజికల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడాలనుకుంటే మార్చి 26 వరకు వెయిట్ చేయాల్సిందే.

Published : 
  • 6 March 2026, 1:55 PM IST