తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటుడు అడివి శేష్. కమర్షియల్ హంగుల కంటే కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ.. క్షిణం, గూఢచారి, మేజర్, హిట్-2 వంటి వరుస విజయాలతో 'మినిమం గ్యారెంటీ' హీరోగా ఎదిగారు. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో శేష్ పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక యంగ్ హీరో తనను ఉద్దేశించి చేసిన వెటకారపు వ్యాఖ్యల గురించి శేష్ బయటపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల ఒక మీడియా హౌస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడివి శేష్ తన కెరీర్ ఆరంభంలో మరియు ఇప్పటికీ ఎదుర్కొంటున్న కొన్ని చేదు అనుభవాల గురించి మాట్లాడారు. ఆ సందర్భంలో ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
"రీసెంట్గా ఒక ఈవెంట్లో ఒక యంగ్ హీరో కలిసినప్పుడు.. 'హే శేష్.. ఇంకా ఎన్నాళ్లని ఇలాంటి సినిమాలే తీస్తావ్? నాలాగా పెద్ద సినిమాలు చేయొచ్చు కదా..' అని వెటకారంగా అన్నాడు."శేష్ ఈ మాటలను చాలా హుందాగా చెప్పినప్పటికీ, ఆ యంగ్ హీరో ఎవరై ఉంటారా? అనే ఆసక్తి నెటిజన్లలో పెరిగిపోయింది. సదరు యంగ్ హీరో ఉద్దేశంలో 'పెద్ద సినిమాలు' అంటే భారీ బడ్జెట్, ఐదు పాటలు, నాలుగు ఫైట్లు ఉండే రొటీన్ మాస్ మసాలా చిత్రాలు కావచ్చు. కానీ, అడివి శేష్ శైలి దానికి భిన్నం. శేష్ రాసుకునే కథల్లో లాజిక్ ఉంటుంది, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటుంది. బడ్జెట్ పరంగా అవి చిన్నవిగా కనిపించినా, బాక్సాఫీస్ వద్ద అవి సాధించే వసూళ్లు, తెచ్చే పేరు మాత్రం చాలా పెద్దవి. మేజర్' వంటి సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందితే, 'గూఢచారి' తెలుగు స్పై థ్రిల్లర్ల స్థాయిని పెంచింది.
అలాంటి నటుడిని చూసి "ఇంకా ఇలాంటి సినిమాలే చేస్తావా?" అని అడగడం ఆ యంగ్ హీరో అహంకారానికి నిదర్శనమా లేక శేష్ ఎదుగుదలను చూసి ఓర్వలేక అన్న మాటలా? అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అడివి శేష్ ఆ హీరో పేరు బయటపెట్టనప్పటికీ, నెటిజన్లు మాత్రం కొందరు యంగ్ హీరోల పేర్లను ప్రస్తావిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. కారణం ఏదైనా, ఒక నటుడి వర్క్ స్టైల్‌ను మరో నటుడు తక్కువ చేసి మాట్లాడటం ఆరోగ్యకరమైన వాతావరణం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అడివి శేష్ తన పనితోనే అందరికీ సమాధానం చెబుతున్నారు. ఎదుటివారు ఎన్ని వెటకారాలు చేసినా, తను నమ్మిన బాటలోనే ప్రయాణిస్తూ వరుస హిట్లు కొడుతున్నారు.సినిమా రంగంలో సక్సెస్ ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. కేవలం బడ్జెట్ పెద్దదైనంత మాత్రాన అది పెద్ద సినిమా అయిపోదు, ప్రేక్షకుల మనసు గెలిచినప్పుడే అది నిజమైన గొప్ప సినిమా అవుతుంది. అడివి శేష్ తనపై వచ్చిన సెటైర్లను స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని అద్భుతమైన చిత్రాలతో ముందుకు రావాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.