సంస్కారం నేర్పండి పీసీబీపై పాక్ మాజీ ప్లేయర్ ఫైర్

భారత్ తో మ్యాచ్ అనగానే పాక్ క్రికెటర్లు ఓవరాక్షన్ చేస్తుంటారు... సీనియర్లే కాదు ఏ జట్టు ఆటగాళ్ళు కూడా ఇలాగే తయారయ్యారు. తాజాగా ఎమర్జింగ్ ఆసియాకప్ లో భాగంగా భారత్ మ్యాచ్ జరిగినప్పుడు యువ బౌలర్ ముఖీమ్‌ ఓవరాక్షన్ చేశాడు.

Post Published By: Vencateshg
Updated : 21 October 2024, 3:03 PM IST

భారత్ తో మ్యాచ్ అనగానే పాక్ క్రికెటర్లు ఓవరాక్షన్ చేస్తుంటారు... సీనియర్లే కాదు ఏ జట్టు ఆటగాళ్ళు కూడా ఇలాగే తయారయ్యారు. తాజాగా ఎమర్జింగ్ ఆసియాకప్ లో భాగంగా భారత్ మ్యాచ్ జరిగినప్పుడు యువ బౌలర్ ముఖీమ్‌ ఓవరాక్షన్ చేశాడు. అభిషేక్ శర్మ ఔటైనప్పుడు పెవిలియన్ వైపు వేలు చూపిస్తూ వెక్కిరించాడు. దీనికి అభిషేక్ కూడా గట్టిగానే రియాక్టయ్యాడు. తాజాగా ఈ ఘటనపై పాక్ మాజీ ఆటగాడు బసిత్ అలీ స్పందించాడు. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా అంటూ ముఖీమ్ ను ప్రశ్నించాడు. అతను ఇంకా పాక్ తరపున పూర్తిస్థాయి క్రికెట్ కూడా ఆడలేదని, ఇప్పుడే ఇలాంటి ప్రవర్తనా అంటూ మండిపడ్డాడు. పాక్ క్రికెట్ బోర్డు ముందు ఆటగాళ్ళకు సంస్కారం నేరపాలని సూచించాడు.

Published : 
  • 21 October 2024, 3:03 PM IST