2.3 కోట్లతో గణపతి అలంకరణ, కంగుతిన్న మంత్రి లోకేష్

మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఏ స్థాయిలో చేస్తారో అందరికి తెలిసిందే. వినాయక పూజ ఎంత బాగా చేస్తే అంత బాగా కలిసి వస్తుందని భావిస్తారు. ఇందుకోసం భారీగానే ఖర్చు చేస్తారు.

Post Published By: Vencateshg
Updated : 13 September 2024, 7:03 PM IST

మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఏ స్థాయిలో చేస్తారో అందరికి తెలిసిందే. వినాయక పూజ ఎంత బాగా చేస్తే అంత బాగా కలిసి వస్తుందని భావిస్తారు. ఇందుకోసం భారీగానే ఖర్చు చేస్తారు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో రూ.2.30 కోట్ల రూపాయల నోట్లతో గణనాథుని అలంకరణ చేసాడు ఓ వ్యాపారి. ప్రతి ఏటా కరెన్సీతో వినాయకుడుకీ అలంకరణ చేస్తున్నారు బాలాజీ గుప్తా.

ఈ ఏడాది ఏకంగా 2.3 కోట్ల విలువైన నోట్లను అలంకరణ కోసం వినియోగించారు గుప్తా. 20,50,100,500 నోట్లను ఉపయోగించి భారీగా అలంకరించారు. కాసేపటి క్రితం మంత్రి నారా లోకేష్ వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్వాహకులను అభినందించారు. విగ్రహానికి అలంకరించిన నగదు చూసి లోకేష్ షాక్ అయ్యారు.

Published : 
  • 13 September 2024, 7:03 PM IST