Telangana Bhavan : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం..

కాసేపట్లో తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 July 2024, 12:03 PM IST

 

 

కాసేపట్లో తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. ఇక 25వ తేదీన అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. అదే రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు శాస‌న‌స‌భ‌లో సీఎం రేవంత్ అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం కానుంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ స‌మ‌వేశంలో చర్చిస్తారు. అసెంబ్లీలో ఉద్యోగ క్యాలెండర్, నిరుద్యోగ సమస్యలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ వైఫల్యంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించనుంది. అదేవిధంగా చేనేత కార్మికుల ఆత్మహత్యలపై... ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్సుమెంట్స్, పారిశుద్ధ్యంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ చర్చించనుంది.

Suresh SSM

Published : 
  • 23 July 2024, 12:03 PM IST