మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ మూవీ ప్లాన్ చేశాడు. కాని తర్వాత తనకి హ్యాండ్ ఇచ్చిన బన్నీతో అదే ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ప్రయత్నం చేశాడు.. ఇది తన వెన్నుపోటు మీదొచ్చిన వార్త... ఏదేమైనా తర్వాత పెద్ద పంచాయితీలే జరిగాయి... త్రివిక్రమ్ సారి చెప్పి మళ్లీ ఎన్టీఆర్ గూటికే చేరాడన్నారు. కట్ చేస్తే ఇంకా ఏదో ట్విస్ట్ కనిపిస్తోందా? ఇంత జరిగినా మాటల మాంత్రికుడు మారలేదా? మళ్లీ తను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని మళ్లీ కలిశాడా? ఎంతైనా ముందు ఈ కథ బన్నీ తోనే అనుకున్నాడు త్రివిక్రమ్.. కాని తను డేట్లివ్వకపోవటంతో, ఎన్టీఆర్ ఇంటికి చేరాడు.. కాబట్టి తనతోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలి...దీనికి తోడు కథ లో మార్పుల పరంగా ఎన్టీఆర్ అలానే తన టీం చాలా వర్కే చేసింది. కథ రూపురేఖలు మారాక, సడన్ గా త్రివిక్రమ్ బన్నీ కాంపౌండ్ చేరటంతోనే మొన్నా మధ్య చాలా పెద్ద పంచాయితే నడిచింది. ఇప్పుడు సద్దుమనికి ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ ని క్షమించటం జరిగిందన్న ప్రచారం కనిపించింది. కాని మళ్లీ ఇప్పుడు కథ మొదటికే వచ్చిందట... ఇంత జరిగానా మాటల మాంత్రికుడు మారట్లేదా? మళ్లీ మళ్లీ వెన్నుపోటుకే ప్రిపేర్ అయ్యాడా? ఎందుకు లైట్ తీసుకున్న బన్నీ చూట్టే తిరుగుతున్నాడు?
డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమా ఏంటి? ఈప్రశ్నకి కాసేపు త్రివిక్రమ్ సినిమా లేదు, దేవర 2 అని చాలా రోజులుగా పజిల్ నడుస్తోంది. ఐతే మాటల మాంత్రికుడు సడన్ గా గాడ్ ఆఫ్ వార్ మూవీ కథని, బన్నీ దగ్గరకు తీసుకెళ్లటం, ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవటం జరిగిందన్నారు. తర్వాత కాపీ రైట్స్ మాత్రం ఎన్టీఆర్ దగ్గరే ఉండటంతో, గత్యంతరం లేక తిరిగొచ్చి, తనతోనే సినిమాచేసే ప్రయత్నం చేశాడని కూడా అన్నారు.ఆవిషయంలోనేచాలా పెద్ద పంచాయితీ నడిచింది.. కట్ చేస్తే ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ సారి చెప్పటం, గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు సర్వం సిద్దమవ్వటం జరిగింది. కట్ చేస్తే సడన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వెళ్లి బన్నీని కలవటమే కలవరపెడుతోంది. నిజానికి బన్నీతోనే గాడ్ ఆఫ్ వార్ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. అందులో ఎలాంటి డౌట్ లేదు.
కాని బన్నీ ఎందుకో త్రివిక్రమ్ ని నమ్మలేదో, తనని పక్కన పెట్టాడో.. కాని ఆట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తూ బిజీ అయ్యాడు. అలాంటి టైంలోనే ఎన్టీఆర్ ని కలిస్తే, తను త్రివిక్రమ్ కి బల్క్ గా డేట్లిచ్చేశాడు.తనతోపాటు, తన టీం కూడా కథ లో మార్పుల విషయంలో మాటల మాంత్రికుడితో కలిసి స్టోరీ సిట్టింగ్స్ కి రెండు నెలల పైనే కష్టపడింద. తీరా కథంతా ఒక షేప్ కి వచ్చాక, త్రివిక్రమ్ ప్లేట్ మార్చాడనే ప్రచారమే వివాదంగా మారింది.ఫైనల్ గా త్రివిక్రమ్ మీద ఎన్టీఆర్ కన్నెర్ర చేయటం, తాను సారి చెప్పి పంచాయితీకి ఫుల్ స్టాప్ వేయటం జరిగాయి. ఇదంతా సంక్రాంతి తర్వాత జరిగిన రచ్చంటున్నారు. ఏదేమైనా అంతా సర్దుకుందనుకుంటే, సడన్ గా మరో సారి వెన్నుపోటు పొడిచి, బన్నీతోనే సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. పుష్ప రాజ్ గా రెండు సార్లు పాన్ ఇండియాని షేక్ చేసిన బన్నీనే త్రివిక్రమ్ మేయిన్ టార్గెట్ అంటున్నారు
జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో ఇలా ఈ ముగ్గురి కాంబినేషన్ లో క్లాస్ హిట్లు పడ్డాయి. ఈసారి మైథాలజీ ప్రాజెక్ట్ కూడా తనతోనే తీయాలని గట్టిగా పట్టుబడ్డాడట త్రివిక్రమ్. ఆ ప్రాసెస్ లో గతంలో అలానే ఇప్పుడు సాయానికి చేయిచ్చిన ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచేందుకు సిద్దపడ్డాడట.. కాని ఎందుకు? అప్పట్లో త్రివిక్రమ్ టైం బాలేనప్పుడు అరవింద సమేత వీరరాఘవవిషయంలో సాయం చేసిన ఎన్టీఆర్, ఇప్పుడు బన్నీ ఈ దర్శకుడిని పక్కన పెట్టినా తను దగ్గరకు తీశాడు..కాని ఎందుకో బన్నీతో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఎన్టీఆర్ తో లేదనేలా ప్రవర్తిస్తున్నాడట త్రివిక్రమ్... అయినా తనని క్షమిస్తూ ఎన్టీఆర్ ఇంకా ఓపిక పడుతున్నాడనే మాటే వినిపిస్తోంది..
రెండు సార్లు క్షమించినా తను మాత్రం మళ్లీ మళ్లీ బన్నీ గూటికే చేరితే, ఈసారి క్షమాపన ఉండకపోవచ్చనే మాటే వినిపిస్తోంది. కేవలం లార్గ్ సుబ్రహ్మణ్యని బేస్ చేసుకుని వస్తున్న మైథలాజికల్ డ్రాపా లైన్ నచ్చే ఇంతగా ఓపిక పడుతున్నాడట మాటల మాంత్రికుడు.. లేదంటే ఆ మాటల మాంత్రికుడి మంత్రదండం ఎప్పుడో విరిగేదనంటున్నారు. ఏదేమైనా బన్నీని మూడో సారి కలవటం పెద్ద వివాదంగా మారేలా ఉందనేమాటే వినిపిస్తోంది.ఐనా ఆట్లి మూవీ తర్వాత లోకేష్ సినిమా అని తేల్చాడు బన్నీ... ఆలెక్కన మరో రెండేళ్లు త్రివిక్రమ్ వేయిట్ చేస్తాడా? చేయగలడా? అంటే రెండో సారి కూడా బన్నీ ఇలా త్రివిక్రమ్ ని పిచ్చి పుల్లయ్యగా మార్చాడా? ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి లోకేష్ ని లైన్లో పెట్టడంతో, త్రివిక్రమ్ కి మరో సారి పంచ్ పడినట్టేనా? అదే జరిగితే, అటు, ఇటు, ఎటూ కాకుండా పోతాడు త్రివిక్రమ్.