LK Advani : ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. బీజేపీ వర్గాల్లో ఆందోళన..

బీజేపీ సీనియర్ నేత, భారత దేశ మాజీ 7వ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 June 2024, 12:49 PM IST

బీజేపీ సీనియర్ నేత, భారత దేశ మాజీ 7వ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె.అద్వానీ(96) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను వృద్ధాప్య విభాగం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా మూడు నెలల క్రితం ఆయనను కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించింది. అద్వానీ ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న పలువురు బీజేపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. భారతీయ జనతా పార్టీని జాతీయ స్థాయికి తీసుకురావడానికి ఎనలేని కృషి చేశారు. అయోధ్యలో రామమందిర ఉద్యమంను ముందుండి నడిపించారు.

Published : 
  • 27 June 2024, 12:49 PM IST