Mamata Banerjee: ఇండియా కూటమికి మమత షాక్.. లోక్‌సభ ఎన్నికల బరిలో ఒంటరిగానే పోటీ..?
పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ సీట్లున్నాయి. అందులో రెండు మాత్రమే కాంగ్రెస్‌కు ఇస్తామని మమత చెప్పింది. దీనికి కాంగ్రెస్ అంగీకరించలేదు. అంత తక్కువ సీట్లతో సర్దుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు.