డైలాగ్ నాదే పుష్ప…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ చేసే వ్యాఖ్యలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా నటి, నిర్మాత మంచు లక్ష్మి చేసిన కొన్ని వ్యాఖ్యలు

Post Published By: dialnews
Updated : 11 March 2026, 10:55 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ చేసే వ్యాఖ్యలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా నటి, నిర్మాత మంచు లక్ష్మి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'పుష్ప' సినిమాలోని ఐకానిక్ డైలాగ్ "పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్!" తనదేనని ఆమె పేర్కొనడం సంచలనంగా మారింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి, తన రాబోయే చిత్రం 'లేచింది మహిళా లోకం' గురించి మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె మాటల ప్రకారం.. "లేచింది మహిళా లోకం సినిమా పుష్ప రిలీజ్ అవ్వక ముందే మేము ఫినిష్ చేశాం. ఆ సినిమాలో 'ఫ్లవర్ కాదు ఫైర్' అనే డైలాగ్ ఫస్ట్ నేనే చెప్పాను. కానీ మా సినిమా లేట్ అవ్వడం వల్ల ఆ డైలాగ్ బయటకు రాలేదు అని అన్నారు.

ఈ క్రమంలో డైరెక్టర్ సుకుమార్‌పై ఆమె పరోక్షంగా సెటైర్లు వేశారు. "పుష్ప సినిమాలో ఆ డైలాగ్ వినగానే.. అది నాదే అనిపించి చాలా ఫీల్ అయ్యాను. సుకుమార్ గారు ఆ డైలాగ్‌ను వాడేసుకున్నారు. ఆ డైలాగ్ మా సినిమాలో ముందే వచ్చిందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను" అంటూ ఆమె కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. మంచు లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

కొందరు ఆమె ఆవేదనను సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం సుకుమార్ వంటి క్రియేటివ్ డైరెక్టర్ మరొకరి డైలాగ్ కాపీ కొట్టే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు.
"డైలాగ్స్ అనేవి అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా ఒకేలా ఉండొచ్చు, దానికి కాపీ అని ముద్ర వేయలేం" అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ఆ డైలాగ్ క్రెడిట్ విషయంలో మంచు లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మరి దీనిపై సుకుమార్ టీమ్ లేదా పుష్ప యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో వేచి చూడాలి. ప్రస్తుతం మంచు లక్ష్మి తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Published : 
  • 11 March 2026, 10:55 AM IST