Ongole MLA Balineni Srinivas who will meet CM Jagan today
బాలినేని శ్రీనివాస్ కు వైసీపీ అధికారం వచ్చిన తొలినాళ్లలోనే కేబినెట్ లో చోటు కల్పించారు సీఎం వైఎస్ జగన్. అయితే రెండున్నర ఏళ్ల కాలం మాత్రమే పదవిని కేటాయించడంతో ప్రస్తుతం ఒంగోలులో సాధారణ ఎమ్మెల్యేగా కోనసాగుతున్నారు. మంత్రి పదవి కోల్పోయినప్పటి నుంచి తనకు వైసీపీలో ప్రధాన్యత తగ్గిపోతుందని తెగ ఫీలైపోతున్నారు. పార్టీలోనే కాదు, ప్రభుత్వ అధికారులు, పోలీసుల వద్ద తనకు తగిన గౌరవం లభించడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా పోలీసుల తీరును నిరసిస్తూ తనకు కేటాయించిన గన్ మెన్లను సరెండర్ చేశారు బాలినేని. ఆ తరువాత అధికారుల తీరుపై అనేక ఆరోపణలు చేశారు. వీటన్నింటిపై నేడు ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు బాలినేని ఇలాంటి పరిస్థితులకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
బాలినేని శ్రీనివాస్ పై గతంలో భూ ఆక్రమణలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా ఫేక్ డ్యాక్యూమెంట్ల విషయంలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు దోషులను గాలికొదిలేసి తనను ప్రశ్నించడం ఏందని మండిపడుతున్నారు. ఈ ఫేక్ డాక్యూమెంట్ స్కాములో వైసీపీ వాళ్లు ఉన్నా కేసులు పెట్టి లోపల వేయండి అని సూచించారు.
తన సూచనలపై పోలీసులు, జిల్లా కలెక్టర్ పట్టించుకోవపోవడంతో తన మాటకు గౌరవం లేదని అసహనం వ్యక్తం చేశారు. దీని కారణంగా తన గన్ మెన్లను కూడా వద్దని ఎస్పీకి లేకరాస్తూ సరెండర్ చేశారు. ఇలా గతంలో చాలా విషయాల్లో బాలినేని అసహనం వ్యక్తం చేయడం, అధిష్టానం మందలించడం లేదా నచ్చజెప్పడంతో పరిస్థితి సర్థుమణిగేది. మరోసారి బాలినేని చేసిన చర్యలపై చర్చించేందుకే సీఎం జగన్ ను కలువనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో కలవడానికి కారణాలు ఇవే..
ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో మరోసారి బాలినేని పిలింపించి మాట్లాడే సంప్రదాయానికి తెర తీసింది. బాలినేని శ్రీనివాస్ జగన్ కి దగ్గరి బంధువు కావడంతో ఈ భూ అక్రమాల ఆరోపణలతోపాటూ తాజాగా బాలినేని చేసిన చర్యలపై జగన్ ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి.
T.V.SRIKAR