గూగుల్ ను ట్యాగ్ చేస్తూ వైసీపీ అభిమానుల పోస్ట్ లు…!

ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల అంశం విషయంలో వైసీపీ నేతలు ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వినుకొండ లో జరిగిన ఒక హత్యను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం వైసీపీ అధినేత జగన్ చేసారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా లేవు అంటూ ఆయన ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపారు. అయితే ఇప్పుడు ఇది కాస్త తీవమైంది. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ లు వివాదాస్పదం అవుతున్నాయి. ఏపీలో […]

Post Published By: Vencateshg
Updated : 7 August 2024, 1:10 PM IST

ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల అంశం విషయంలో వైసీపీ నేతలు ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వినుకొండ లో జరిగిన ఒక హత్యను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం వైసీపీ అధినేత జగన్ చేసారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా లేవు అంటూ ఆయన ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపారు. అయితే ఇప్పుడు ఇది కాస్త తీవమైంది. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ లు వివాదాస్పదం అవుతున్నాయి.

ఏపీలో శాంతి భద్రతలు బాగాలేవు అంటూ ఎక్స్ లో గూగుల్ ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ లు పెట్టారు. నిన్న చంద్రబాబు చేసిన పోస్టుకు గూగుల్ ని ట్యాగ్ చేస్తూ మహిళా ఉద్యోగులను వేధిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని పేర్కొన్నారు. నెదర్లాండ్స్ కు కూడా ఈ విషయం తెలుసని పోస్ట్ చేసారు. అమరావతి వరద ప్రభావిత ప్రాంతం హైదరాబాద్ ఎంచుకోండి అంటూ పోస్ట్ పెట్టడం ఇప్పుడు సంచలనం అయింది. రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీని స్థాపించేందుకు ఇప్పుడు గూగుల్ తో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు.

Published : 
  • 7 August 2024, 1:10 PM IST