సాయిసుదర్శన్ సెంచరీ ఆసీస్ ఏ టార్గెట్ 225

ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత యువ క్రికెటర్ సాయిసుదర్శన సెంచరీతో అదరగొట్టాడు. 9 ఫోర్ల సాయంతో శతకం సాధించాడు. అతనితో పాటు దేవ్‌దత్‌ పడిక్కల్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు.

Post Published By: Vencateshg
Updated : 2 November 2024, 7:04 PM IST

ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత యువ క్రికెటర్ సాయిసుదర్శన సెంచరీతో అదరగొట్టాడు. 9 ఫోర్ల సాయంతో శతకం సాధించాడు. అతనితో పాటు దేవ్‌దత్‌ పడిక్కల్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. పడిక్కల్ 8 ఫోర్లతో 88 పరుగులు చేయగా...ఇషాన్‌ కిషన్‌ పర్వాలేదనిపించాడు. సాయి సుదర్శన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఆదుకోవడంతో భారత్ ఏ రెండో ఇన్నింగ్స్ లో 312 పరుగులు చేయగలిగింది. తద్వారా ఆసీస్ కు 225 పరుగుల టార్గెట్ ను నిర్థేశించింది. ఛేజింగ్ లో ఆసీస్ ఏ జట్టు విజయం దిశగా సాగుతోంది. మూడోరోజు ఆటముగిసే సమయానికి ఆసీస్ యువ జట్టు 3 వికెట్లకు 139 పరుగులు చేసింది. విజయం కోసం ఇంకా 86 రన్స్ చేయాల్సి ఉండగా.. చేతిలో 7 వికెట్లున్నాయి.

Published : 
  • 2 November 2024, 7:04 PM IST