TOP NEWS TODAY: డయల్ తెలుగు టాప్ న్యూస్

డయల్ తెలుగు నేటి టాప్ వార్తలు..

Post Published By: narender Thiru
Updated : 12 March 2024, 1:20 PM IST

నేటి నుంచి సీఏఏ అమలు
పౌరసత్వ సవరణ చట్టం 2019 (CAA)ను సోమవారం నుంచి అమలు చేయబోతున్నట్టు కేంద్రం గెజిట్ రిలీజ్ చేసింది. ఈ చట్టం అమలుతో భారత్‌లో తలదాచుకున్న శరణార్థులకు శాశ్వతంగా ఇక్కడే నివాసం ఉండే అవకాశం కలుగుతుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి  CAA Notification: ఇవాళ్టి నుంచి సీఏఏ అమలు.. గెజిట్ రిలీజ్ చేసిన కేంద్రం !

 

అగ్ని-5 మిస్సైల్ పరీక్ష సక్సెస్
చైనాయే లక్ష్యంగా భారత్ రూపొందించిన అగ్ని-5 మిస్సైల్ పరీక్ష విజయవంతమైంది. చైనాను దృష్టిలో పెట్టుకొని ఇండియా అగ్ని 5ను సొంతంగా డెవలప్ చేసింది. ఈ సందర్భంగా DRDO సైంటిస్టులకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి  Agni-5 Success: అగ్ని5 మిస్సైల్ సక్సెస్.. టార్గెట్‌లోకి చైనాలోని కీలక ప్రాంతాలు..!

 

టాలీవుడ్‌లో విషాదం.. దర్శకుడు సూర్యకిరణ్‌ కన్నుమూత..!
సత్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సూర్యకిరణ్.. అనారోగ్యంతో కన్నుమూశారు. పచ్చకామెర్లు రావడంతో చికిత్స పొందుతూ ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి  Surya Kiran: విషాదం.. దర్శకుడు సూర్యకిరణ్‌ కన్నుమూత.. కారణం ఇదే!

 

రఘురామకు బీజేపీ ఝలక్‌.. ప్రభాస్ ఫ్యామిలీకే నరసాపురం టికెట్‌!
వైసీపీకి రాజీనామా చేసిన నరసాపురం ఎంపీ రఘురామకు బీజేపీ ఝలక్ ఇచ్చింది. రఘురామకు టికెట్ ఇచ్చేందుకు.. కమలం పార్టీ ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి  Raghu Rama Krishna Raju: రఘురామకు బీజేపీ ఝలక్‌.. ప్రభాస్ ఫ్యామిలీకే నరసాపురం టికెట్‌!

 

మళ్లీ ఆస్కార్ వేదిక మీద ఆర్ఆర్ఆర్..
ఆస్కార్ అవార్డుల వేదికపై మరోసారి ఇండియన్ ఫిలిం ఆర్ఆర్ఆర్‌కు గౌరవం దక్కింది. సోమవారం జరిగిన 2024 ఆస్కార్ అవార్డుల వేడుకలో హాలీవుడ్ మూవీస్‌తో పాటు త్రిబుల్ ఆర్ మూవీ వీడియోస్ ప్లే అయ్యాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి RRR: రాజమౌళి ఏం స్కెచ్చేశాడు.. మళ్లీ ఆస్కార్ వేదిక మీద ఆర్ఆర్ఆర్..

 

మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. నిడదవోలు నుంచి కందులు దుర్గేశ్ పోటీ
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేయబోయే మరో అభ్యర్థి పేరును పవన్ కల్యాణ్ ప్రకటించారు. నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థిగా కందుల దుర్గేశ్ పోటీ చేయబోతున్నట్లు పవన్ వెల్లడించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి Raghu Rama Krishna Raju: రఘురామకు బీజేపీ ఝలక్‌.. ప్రభాస్ ఫ్యామిలీకే నరసాపురం టికెట్‌!

 

గోబీ మంచూరియా ఫుడ్ కలర్‌పై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం..
రోడమైన్-బి కెమికల్‌ను ఆహార పదార్థాల తయారీలో వాడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండు రావ్ హెచ్చరించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి gobi manchurian: గోబీ మంచూరియా ఫుడ్ కలర్‌పై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం..

 

ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్ పెళ్ళి.. 4 రాష్ట్రాల పోలీసులకు టెన్షన్
ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్ పెళ్ళి చేసుకోవడం ఏమో గానీ.. నాలుగు రాష్ట్రాల పోలీసులకు తిప్పలు వచ్చాయి. వీళ్ళ పెళ్ళికి పెద్ద ఎత్తున గ్యాంగ్‌స్టర్స్ వస్తారని భారీ బందోబస్తు కల్పించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి GANGSTER MARRIAGE: ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్ పెళ్ళి.. 4 రాష్ట్రాల పోలీసులకు టెన్షన్

 

పంత్ తిరిగొస్తున్నాడు.. ఐపీఎల్‌లో ఆడేందుకు లైన్ క్లియర్
ఘోర రోడ్డు ప్రమాదానికి గురైనప్పటి నుంచి పంత్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవల పూర్తిగా కోలుకోవడంతో కొద్ది రోజుల కిందటే ఈ యువ వికెట్ కీపర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి Rishabh Pant: పంత్ తిరిగొస్తున్నాడు.. ఐపీఎల్‌లో ఆడేందుకు లైన్ క్లియర్

 

హీరోయిన్‌తో కిరణ్ అబ్బవరం ఎంగేజ్‌మెంట్‌
యువ హీరో కిరణ్ అబ్బవరం ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన తొలి చిత్రం హీరోయిన్ హస్య గోరఖ్‌నే కిరణ్‌ అబ్బవరం పెళ్లి చేసుకోబోతున్నాడు. రాజావారు.. రాణిగారులో ఈమె హీరోయిన్‌గా యాక్ట్ చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి Kiran Abbavaram: కంగ్రాట్స్ అబ్బవరం.. హీరోయిన్‌తో కిరణ్ అబ్బవరం ఎంగేజ్‌మెంట్‌..

Published : 
  • 11 March 2024, 9:03 PM IST