దుప్పటి కోసం ప్రాణాలు వదిలేసిన మహిళ

చావు రాసిపెట్టి ఉంటే ఏ రూపంలో అయినా వస్తుంది అనడానికి తాజాగా జరిగిన ఒక ఘటన ఉదాహరణ. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని పెద్దవాగులో భార్య, భర్తలు గల్లంతు అయ్యారు.

Post Published By: Vencateshg
Updated : 6 September 2024, 5:45 PM IST

చావు రాసిపెట్టి ఉంటే ఏ రూపంలో అయినా వస్తుంది అనడానికి తాజాగా జరిగిన ఒక ఘటన ఉదాహరణ. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని పెద్దవాగులో భార్య, భర్తలు గల్లంతు అయ్యారు. బట్టలు పిండేందుకు వాగుకు వెళ్లిన సమయంలో బ్లాంకెట్ వాగులో కొట్టుకుపోవడంతో.. బ్లాంకెట్ కోసం ప్రయత్నించింది భార్య. అయితే ఆమె వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది.

వెంటనే గమనించిన భర్త... భార్యను కాపాడే ప్రయత్నంలో వాగులో కొట్టుకుపోయాడు భర్త పోశెట్టి. పోశెట్టిని నీటి ప్రవాహంలో నుంచి రక్షించగా... అతని భార్య మాత్రం ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Published : 
  • 6 September 2024, 5:45 PM IST

Topics :