Top story:అమెరికా రాడార్లకే జాంబీ షాక్, బ్లాకేడ్ లేదు,బొక్క లేదు… మాస్టర్ గేమ్ తో ఇరాన్ ఎస్కేప్ సముద్రంలో అమెరికాకు సినిమా చూపిస్తున్న ఇరాన్ …సముద్రం మధ్యలో ‘డిజిటల్ గెరిల్లా వార్’…!

సముద్రం మీద 10 వేల మంది అమెరికా సైనికులు, అత్యాధునిక యుద్ధ నౌకలు, ఆకాశంలో గూఢచారి డ్రోన్లు.. చుట్టూ వేల కళ్లు.. ఇలా.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 'హోర్ముజ్ జలసంధి'ని డొనాల్డ్ ట్రంప్ దిగ్బంధించారు.

Post Published By: dialnews
Updated : 18 April 2026, 12:20 PM IST

సముద్రం మీద 10 వేల మంది అమెరికా సైనికులు, అత్యాధునిక యుద్ధ నౌకలు, ఆకాశంలో గూఢచారి డ్రోన్లు.. చుట్టూ వేల కళ్లు.. ఇలా.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 'హోర్ముజ్ జలసంధి'ని డొనాల్డ్ ట్రంప్ దిగ్బంధించారు. ఒక్క చుక్క ఆయిల్ కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదని ఆర్డర్ వేశారు. కానీ.. సరిగ్గా అక్కడే అసలు సినిమా మొదలైంది. అమెరికా రాడార్ స్క్రీన్‌ల మీద కనిపిస్తున్న నౌకలు ఒక్కసారిగా గాలిలో కలిసిపోతున్నాయి. రాడార్‌లో ఒకచోట కనిపిస్తే, నిఘా విమానాలకు మరోచోట దర్శనమిస్తున్నాయి. అసలు ఇరాన్ వాడుతున్న ఆ 'జాంబీ ఐడీలు' ఏంటి..? రష్యా దగ్గర నేర్చుకున్న ఆ 'షాడో ఫ్లీట్' మ్యాజిక్ ఏంటి..? ట్రంప్ లాక్ చేసినా ఇరాన్ ఎలా చొరబడుతోంది..? లెట్స్ డైవ్ ఇన్

ట్రంప్ ఉద్దేశం చాలా క్లియర్. ఇరాన్ ఆర్థిక వెన్నెముకను విరిచేయాలి. అందుకే ప్రపంచంలోనే అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి'ని క్లోజ్ చేశారు. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే.. ప్రపంచంలో రవాణా అయ్యే చమురులో 20% ఇక్కడి నుంచే వెళ్లాలి. కానీ దిగ్బంధనం అమల్లోకి వచ్చిన 24 గంటలకే అమెరికా నిఘా వర్గాలు షాక్ అయ్యాయి. ఇరాన్‌తో సంబంధం ఉన్న నౌకలు అమెరికా నేవీ కళ్లముందే అదృశ్యమవుతున్నాయి. ఇరాన్ ఇక్కడ ఏ అస్త్రం వాడుతుందో తెలుసా..? అది ఫిజికల్ వార్ కాదు.. 'డిజిటల్ గెరిల్లా వార్'.

ఇప్పుడు అసలు మ్యాటర్ కి వద్దాం. సముద్రంలో ప్రయాణించే ప్రతి నౌకకు 'డిజిటల్ ఫింగర్ ప్రింట్' లాంటి ఒక తొమ్మిది అంకెల కోడ్ ఉంటుంది. దాన్నే AIS అంటారు. ఇరాన్ నౌకలు అమెరికా జోన్‌లోకి రాగానే ఈ సిస్టమ్ ఆఫ్ చేసేస్తున్నాయి. రాడార్‌లో నౌక 'డెడ్' అయిపోతుంది. కానీ ఫిజికల్‌గా అది వెళ్తూనే ఉంటుంది. నౌకలు తమ AIS సిస్టమ్‌ను ఆఫ్ చేసినప్పుడు ఆ సమయాన్ని నిపుణులు "డార్క్ పీరియడ్" అని పిలుస్తారు. ఇరాన్ నౌకలు హోర్ముజ్ జలసంధిలోకి రాగానే ఈ 'చీకటి యుద్ధం' మొదలుపెడతాయి.

అవి అదృశ్యమయ్యాక, గమ్యస్థానానికి చేరుకునే వరకు మళ్లీ రాడార్‌లో కనిపించవు. అంటే మధ్యలో ఆ నౌకలు ఎక్కడ చమురును లోడ్ చేశాయి లేదా ఎక్కడ అన్-లోడ్ చేశాయో కనిపెట్టడం అమెరికా శాటిలైట్లకు కూడా ఒక పెద్ద పజిల్. ఇంకొకటి.. జాంబీ ఐడీ.. ఇది హైలైట్ పాయింట్. చనిపోయిన మనిషి తిరిగి వస్తే జాంబీ అంటాం కదా.. అలాగే స్క్రాప్‌కు వెళ్ళిపోయిన పాత నౌకల ఐడీలను ఇరాన్ వాడుతోంది. అంటే పేపర్ మీద ఆ నౌక ఎప్పుడో మునిగిపోయింది లేదా పాత ఇనుము కింద అమ్మేశారు.. కానీ సముద్రంలో మాత్రం ఆ నౌక 'జాంబీ'లా ప్రయాణిస్తూ చమురును తరలిస్తోంది.

మరొకటి స్పూఫింగ్ మాయ.. అమెరికా నేవీ నిలబడిన చోటే ఇరాన్ నౌక వెళ్తుంది.. కానీ రాడార్‌లో మాత్రం ఆ నౌక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు చూపిస్తుంది. విండ్‌వార్డ్ సీఈఓ అమీ డేనియల్ చెప్పినట్టు.. ఇది సముద్రంలో జరుగుతున్న అతిపెద్ద 'ఐడెంటిటీ ఫ్రాడ్'. ఈ ట్రిక్కులన్నీ ఇరాన్ కి ఎక్కడి నుంచి వచ్చాయి..? దీని వెనుక ఉంది రష్యా. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా మీద ఆంక్షలు పెట్టినప్పుడు, పుతిన్ ఒక 'షాడో ఫ్లీట్' అంటే.. నీడలాంటి నౌకాదళంను.. తయారు చేశారు.

ఉదాహరణకు 'ముర్లికిషన్' అనే నౌకను తీసుకో. దాని మీద జెండా చూస్తే 'మడగాస్కర్' ది ఉంటుంది. యాజమాన్యం ఎక్కడో దుబాయ్‌లో ఉంటుంది. కానీ లోపల ఉండేది మాత్రం ఇరాన్ చమురు. అమెరికా నేవీ ఆ నౌకను ఆపి చెక్ చేసేలోపే.. అది మరో దేశం సరిహద్దులోకి వెళ్ళిపోతుంది. ఇలా ఒక దేశంలో పుట్టి, మరో దేశం జెండా కప్పుకుని, ఇంకో దేశం కోసం పని చేసే ఈ 'ఘోస్ట్ షిప్స్' ట్రంప్ వ్యూహానికి చిల్లులు పెడుతున్నాయి. అంటే.. కేవలం సముద్రం మీదే కాదు బాబాయ్.. ఇంటర్నెట్‌లో కూడా ఇరాన్ యుద్ధం చేస్తోంది.

ఇరాన్ నౌకలు నేరుగా పోర్టులకు వెళ్లడం లేదు. సముద్రం మధ్యలో అంతర్జాతీయ జలాల్లో వేరే దేశాల నౌకలతో.. ఉదాహరణకు తీసుకుంటే.. రష్యా లేదా ఇతర దేశాల షాడో నౌకలతో చేతులు కలుపుతున్నాయి. అక్కడ నౌక నుంచి నౌకకు చమురును మార్చేసి, ఆ తర్వాత ఆ చమురు ఇరాన్ నుంచి రాలేదని నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. ఇది ఒక రకమైన 'ఆయిల్ లాండరింగ్'. కొన్ని ఇరాన్ నౌకలు అత్యాధునిక సాఫ్ట్‌వేర్ వాడుతూ తమ లొకేషన్‌ను తారుమారు చేస్తున్నాయి.

రాడార్‌లో చూస్తే ఆ నౌక దుబాయ్ తీరంలో ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది ఇరాన్ పోర్టులో లోడింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ డిజిటల్ మాయాజాలం వల్ల అమెరికా తన యుద్ధ నౌకలను ఎటు పంపించాలో తెలియక అయోమయంలో పడిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా నౌకల పాత ఐడీలను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. రష్యా ఈ విద్యలో ఆరితేరింది. ఇప్పుడు ఇరాన్ అదే బాటలో నడుస్తూ.. ఎప్పుడో వాడకం ఆగిపోయిన దేశాల.. ఉదాహరణకు పనామా, లైబీరియా వంటివి ఫ్లాగ్స్‌ను మరియు ఐడీలను వాడుకుంటూ 'రాజ్యం లేని నౌకల'గా అమెరికా ఆంక్షల నుంచి తప్పుకుంటున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయాలు సోషల్ మీడియాలో మైండ్ గేమ్ ఆడుతున్నాయి. "మీరు ఆపలేరు.. మేము ఆగము" అనే రేంజ్ లో పోస్టులు పెడుతూ అమెరికా నిఘా వైఫల్యాలను ఎండగడుతున్నాయి. ఈ గందరగోళం వల్ల ఏది నిజమో, ఏది అబద్ధమో తెలీక ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. సో బాబాయ్.. హోర్ముజ్ జలసంధి ఇప్పుడు ఒక మంటల కొలిమి. ట్రంప్ దగ్గర బలం ఉంది, కానీ ఇరాన్ దగ్గర బలంతో పాటు బలమైన 'టెక్నికల్ మాస్టర్ ప్లాన్' ఉంది.

అమెరికా దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమ నేవీ ఉండొచ్చు, కానీ వారు అంతర్జాతీయ సముద్ర చట్టాలకు లోబడి పనిచేయాలి. ఒక నౌకపై దాడి చేయాలన్నా లేదా ఆపాలన్నా పక్కా ఆధారాలు ఉండాలి. ఇరాన్ నౌకలు తమ గుర్తింపును నిరంతరం మారుస్తూ ఉండటం వల్ల, చట్టపరంగా వాటిని ఆపడం అమెరికాకు ఒక పెద్ద లీగల్ తలనొప్పిగా మారింది. మరి 'జాంబీ ఐడీలు', 'షాడో ఫ్లీట్' తో ఇరాన్ వేస్తున్న ఎత్తులకు అమెరికా దగ్గర జవాబు ఉందా..? లేక ఈ యుద్ధం ప్రపంచాన్ని మరో ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుందా..? చూడాలి.

Published : 
  • 18 April 2026, 12:20 PM IST