BANDLA GANESH: ఎమ్మెల్సీ ఖాయమా..? రేవంత్‌ రెడ్డి, బండ్ల భేటీలో ఏం జరిగింది..?

కళాకారుల కోటాలో బండ్ల గణేష్‌కు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారని టాక్‌. ఇప్పటికే ఈ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం. ఇలాంటి వార్తలు రాజకీయ వర్గాల్లో వస్తున్న నేపథ్యంలో.. సీఎంతో బండ్ల గణేష్‌ భేటీ అవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Post Published By: narender Thiru
Updated : 2 January 2024, 2:43 PM IST

BANDLA GANESH: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిర్మాత బండ్ల గణేష్‌ ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతున్నారు. ప్రతీ విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల కంటే కూడా పవర్‌ఫుల్‌గా బీఆర్‌ఎస్‌ మాటలకు కౌంటర్లతో తిప్పి కొడుతున్నారు. దీంతో ఆయన కష్టానికి త్వరలోనే ప్రతిఫలం దక్కబోతోందని కొన్ని రోజుల నుంచి రాజకీయ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

PONNAM PRABHAKAR: ఎమ్మెల్యే చిలిపి పని.. వివాదంలో మంత్రి పొన్నం..

కళాకారుల కోటాలో బండ్ల గణేష్‌కు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారని టాక్‌. ఇప్పటికే ఈ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం. ఇలాంటి వార్తలు రాజకీయ వర్గాల్లో వస్తున్న నేపథ్యంలో.. సీఎంతో బండ్ల గణేష్‌ భేటీ అవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. న్యూ ఇయర్‌ సందర్భంగా బండ్ల గణేష్‌ రేవంత్‌ రెడ్డిని కలిశారు. బొకే ఇచ్చి న్యూ ఇయర్‌ విషెస్‌ తెలిపారు. ఈ క్రమంలో వీళ్ల మధ్య ఎమ్మెల్సీ విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. బండ్ల గణేష్‌ విషయంలో రేవంత్‌ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నట్టు టాక్‌. దీంతో త్వరలోనే బండ్ల గణేష్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారంటూ మరోసారి టాక్‌ మొదలయ్యింది.

బండ్ల గణేష్‌తో పాటు మరి కొందరు పేర్లు కూడా ఎమ్మెల్సీ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్లలో కొందరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి బండ్లన్న విషయంలో అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

https://youtu.be/VDBbND8zvC4

 

Published : 
  • 2 January 2024, 2:43 PM IST