ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అందరి దృష్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. ముఖ్యంగా గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. బెజవాడ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమిలోని కీలక నేతలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
