తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సిఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. గత నాలుగు నెలల నుంచి వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్యే వ్యవహారశైలితో టీడీపీ అధిష్టానం ఇబ్బంది పడుతోంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున కొలికపూడితో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా భేటీ అయి వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు మిమ్మల్ని ఉపేక్షించడం లేదు అంటూ హెచ్చరించారు.
ఇక నేడు చంద్రబాబు కూడా సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. సమస్యలు ఉంటే నేరుగా పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడాలని, అంతే గాని పార్టీ లైన్ దాటవద్దు అంటూ హెచ్చరించారు. నియోజకవర్గ సమస్యలు ఉంటే తనను కలవాలని, మంత్రులు అందుబాటులో ఉంటారని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అటు విజయవాడ ఎంపీ కేసినేని చిన్నితో కూడా సిఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది.