Top story: ఇరాన్ మిస్సైల్స్ కు చైనా కెమికల్ పెంటగాన్…గుండెల్లో రైళ్ళు ఇరాన్ నౌకలో చైనా ఏం పంపించింది..?

ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది.. అదే ఇరాన్. అగ్రరాజ్యం అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని నౌకలను అడ్డుకున్నా.. ఇరాన్ మాత్రం 'తగ్గేదే లే' అంటోంది. తాజాగా రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ చేసిన ఒకే ఒక్క ప్రకటన పెంటగాన్ గుండెల్లో రైళ్లు

Post Published By: dialnews
Updated : 22 April 2026, 12:37 PM IST

ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది.. అదే ఇరాన్. అగ్రరాజ్యం అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని నౌకలను అడ్డుకున్నా.. ఇరాన్ మాత్రం 'తగ్గేదే లే' అంటోంది. తాజాగా రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ చేసిన ఒకే ఒక్క ప్రకటన పెంటగాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. హోర్ముజ్ జలసంధిలో అమెరికా స్వాధీనం చేసుకున్న ఇరాన్ నౌకలో అసలు ఏముంది..? చైనా నుంచి ఇరాన్‌కు వెళ్తున్న ఆ క్షిపణి రసాయనాల రహస్యం ఏంటి..? అమెరికా అరాచకాలను ఎదిరిస్తూ ఇరాన్-చైనా ఎలా ఒక్కటయ్యాయి..? వారాంతంలో ఒమన్ గల్ఫ్‌లో అమెరికా దళాలు బలవంతంగా పట్టుకున్న ఇరాన్ నౌక 'MV టౌస్కా'.. ఇప్పుడు ప్రపంచ దేశాల చర్చాంశమైంది. నిక్కీ హేలీ ఆరోపణల ప్రకారం.. ఈ నౌక కేవలం చమురును కాదు, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల తయారీకి వాడే అత్యంత శక్తివంతమైన 'రసాయనాలను' మోసుకెళ్తోంది. అవును.. అమెరికా కళ్లు గప్పి గత ఆరు వారాల్లో రెండుసార్లు చైనాను సందర్శించిన ఈ నౌక, ఇరాన్ సైనిక శక్తిని పెంచే ముడి సరుకును సరఫరా చేస్తోంది. నిన్నమొన్నటి దాకా కేవలం ఆంక్షలతో ఇరాన్‌ను అడ్డుకోవచ్చని భావించిన అమెరికా రక్షణ శాఖ, ఇప్పుడు చైనా నేరుగా 'మిస్సైల్ కెమికల్స్' పంపడం చూసి హడలిపోతోంది.

చైనా సాయం ఉంటే ఇరాన్ క్షిపణులు అమెరికా బేస్‌ల మీదకు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. అమెరికా ఆంక్షల అడవిలో ఇరాన్ కుప్పకూలిపోతుందని ట్రంప్ ఆశపడితే, చైనా మాత్రం 'మిత్రమా నేనున్నా' అంటూ క్షిపణి ఇంధనాన్ని పంపిస్తోంది. ఇది చూసే పెంటగాన్ అధికారులకు పిచ్చి ఎక్కుతోంది. నిక్కీ హేలీ ఏవేవో ఆరోపణలు చేయవచ్చు.. కానీ వాస్తవం ఏంటంటే, ఒక స్వతంత్ర దేశానికి చెందిన వాణిజ్య నౌకపై అమెరికా కాల్పులు జరపడం అనేది అంతర్జాతీయ 'సముద్రపు దొంగతనం'.ఇరాన్ తన ఆత్మరక్షణ కోసం క్షిపణులను తయారు చేసుకుంటే అమెరికాకు వచ్చిన నొప్పేంటి..? తన దేశాన్ని కాపాడుకోవడానికి మిత్ర దేశం చైనా నుంచి రసాయనాలు తెచ్చుకుంటే తప్పేంటి..? కానీ ఇరాన్ భయపడటం లేదు.. అందుకే స్పష్టంగా చెప్పింది, 'మీరు దిగ్బంధనం ఎత్తివేసే వరకు ఇస్లామాబాద్ చర్చలకు రాము'. అమెరికా బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ ఇరాన్ దగ్గర సాగవు. నిక్కీ హేలీ మాటల్లోనే చెప్పాలంటే.. 'చైనా ఇరాన్ పాలనను నిలబెడుతోందన్నది ఇప్పుడు విస్మరించలేని వాస్తవం'.

అమెరికా ఆధిపత్యానికి చరమగీతం పాడటానికి ఇరాన్-చైనా చేతులు కలిపాయి. ఇరాన్ దగ్గర ఉన్న అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణుల వెనుక చైనా సాంకేతికత ఉందనే భయం ఇప్పుడు ట్రంప్‌ను వెంటాడుతోంది. అందుకే ఓడలను అడ్డుకుంటున్నారు, కమాండోలను యుద్ధ ఖైదీలుగా మారుస్తామని బెదిరిస్తున్నారు. కానీ ఇరాన్ తన పంథా మార్చుకోదు. చైనా రసాయనాలతో తయారయ్యే క్షిపణులు అమెరికా అహంకారాన్ని దెబ్బతీయడానికి సిద్ధంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.చైనా ఇరాన్ పాలనను నిలబెట్టడంలో సహాయపడుతోంది కాబట్టి.. దీనిపై ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరించాలని నిక్కీ హేలీ డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో జరగాల్సిన సమ్మిట్‌ను కూడా రద్దు చేయాలని ఆమె కోరుతున్నారు. రాన్ ఆయుధాలకు చైనా నిధులు ఇస్తోందని, రష్యా తన ఇంటెలిజెన్స్‌తో సహకరిస్తోందని హేలీ పేర్కొన్నారు. అంటే ఇక్కడ అమెరికాకు వ్యతిరేకమైన ఒక పెద్ద 'గ్లోబల్ సిండికేట్' పని చేస్తోంది. నిక్కీ హేలీ ఈ యుద్ధాన్ని 'గేమ్ ఆఫ్ చికెన్' అని పిలిచారు.

అంటే ఇద్దరూ ఒకరినొకరు ఢీకొనే వరకు వస్తారు, చివరికి ఎవరు వెనక్కి తగ్గుతారనేదే ఇక్కడ పాయింట్. హోర్ముజ్ జలసంధి మూతపడితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయని, అది అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు. ఇదే ఇరాన్ మరియు చైనా వాడుకుంటున్న అసలైన ఆయుధం. నిక్కీ హేలీ ఆరోపణలు నిజమే కావచ్చు.. చైనా మద్దతు ఇరాన్‌కు బలాన్ని ఇస్తోంది. ఆ బలంతోనే ఇరాన్ అమెరికా గర్వాన్ని అణచివేస్తోంది.ఇదే టైంలో ఇరాన్ నౌకను పట్టుకోవడంతో, పాకిస్థాన్‌లో జరగాల్సిన శాంతి చర్చలు ఇప్పుడు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దిగ్బంధనం ఎత్తివేయకుండా చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఒప్పందం కుదిరితేనే దిగ్బంధనం తీస్తానని ట్రంప్ తేల్చి చెప్పారు. అంటే, పరిస్థితి ఇప్పుడు శాంతి చర్చల నుంచి నేరుగా రణరంగం వైపు మారుతోంది. హోర్ముజ్ జలసంధిలో మొదలైన తాజా పోరాటం, అగ్రరాజ్యం పతనానికి నాంది పలుకుతుందా..? చైనా-ఇరాన్ స్నేహం ప్రపంచ క్రమాన్ని మార్చేస్తుందా..? వేచి చూడాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం.. తన గడ్డను, తన హక్కును కాపాడుకోవడంలో ఇరాన్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది అనేది మరోసారి ప్రూవ్ అయింది.

Published : 
  • 22 April 2026, 12:37 PM IST