అమెరికా రక్షణ చరిత్రలో ఈ బుధవారం ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. అగ్రరాజ్యం ఇరాన్‌తో యుద్ధం చేస్తోందని అందరూ అనుకుంటున్నారు.. కానీ అసలు యుద్ధం వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ మరియు పెంటగాన్ మధ్య జరుగుతోంది. తన మాట వినలేదని.. సాక్షాత్తూ నావికాదళ కార్యదర్శి జాన్ సి. ఫెలాన్‌ను పై గుర్రుగా ఉంటే.. అసలు నీ మాట వినేది ఏంట్రా అంటూ.. రాజీనామా చేసేసాడు ఆ కీలక అధికారి. ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు సెక్రటరీ స్థాయి వ్యక్తి తప్పుకోవడం అంటే.. అది రాజీనామా కాదు, ట్రంప్ వ్యూహంపై జరిగిన అతిపెద్ద తిరుగుబాటు. అసలు లోపల ఏం జరిగింది..? ట్రంప్ మీద పెంటగాన్ జనరల్స్ ఎందుకు రగిలిపోతున్నారు..?
అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెంటగాన్ అధికారులు ప్రెసిడెంట్ నిర్ణయాలను బహిరంగంగానే తప్పుబడుతున్నారు. 'మేము దేశానికి విధేయులం, ఒక వ్యక్తికి కాదు' అనే నినాదం ఇప్పుడు పెంటగాన్ గోడల మధ్య వినిపిస్తోంది. ట్రంప్ తన సొంత నేవీ సెక్రటరీని మార్చడం ద్వారా సైన్యాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. రాజీనామాకు ముందు ట్రంప్ మరియు ఫెలాన్ మధ్య 45 నిమిషాల పాటు తీవ్రమైన వాగ్వాదం జరిగింది.
హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ నావికా దిగ్బంధనాన్ని తొలగించడానికి ట్రంప్ 'డైరెక్ట్ అటాక్' ఆర్డర్ ఇచ్చారు. దానికి ఫెలాన్ అడ్డు చెప్పారు. 'మిస్టర్ ప్రెసిడెంట్.. మీరు పంపుతున్నది నౌకలను కాదు, 5000 మంది సైనికుల శవపేటికలను' అని ఫెలాన్ గర్జించారు. ఇరాన్ దగ్గరున్న మందుపాతరలు మన నౌకలను నాశనం చేస్తాయని టెక్నికల్ రిపోర్ట్స్ చూపించారు. కానీ ట్రంప్ వినలేదు. అక్కడే ఫెలాన్ తన రాజీనామా లేఖను టేబుల్ మీద విసిరేసి బయటకు వచ్చారు.
కేవలం యుద్ధం గురించే కాదు, నౌకాదళ బడ్జెట్ మరియు ప్రాముఖ్యత విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై ఫెలాన్ అసహనంతో ఉన్నారు. ఫెలాన్ దృష్టిలో నేవీ అనేది ఒక బాధ్యత, కానీ ట్రంప్ దృష్టిలో అది ఒక షో. అమెరికా యుద్ధ నౌకల కంటే ఇరాన్ వేసే మందుపాతరలు శక్తివంతమైనవని ఫెలాన్ చేసిన హెచ్చరికలను ట్రంప్ 'పిరికితనం' అని ఈసడించుకున్నారు. తన ఆత్మగౌరవాన్ని, తన సైనికుల ప్రాణాలను పణంగా పెట్టలేక ఫెలాన్ వైదొలిగారు. ఫెలాన్ తప్పుకున్న వార్త తెలియగానే పెంటగాన్ లోని టాప్ బ్రాస్ అంతా షాక్ అయ్యారు.
సైన్యం అంటే కేవలం తుపాకులు పేల్చడం కాదు, వ్యూహం. కానీ ట్రంప్ కేవలం తన ఇమేజ్ కోసం, ఇజ్రాయిల్ మెప్పు కోసం సైన్యాన్ని బలిపశువును చేస్తున్నారని అధికారులు రగిలిపోతున్నారు. 'పొలిటికల్ ఆర్డర్స్ వేరు, మిలిటరీ లాజిక్ వేరు' అని జనరల్స్ బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ తన చుట్టూ కేవలం 'యస్ మాస్టర్' అనే వారిని ఉంచుకోవాలని చూస్తున్నారని, దీనివల్ల అమెరికా సర్వనాశనం అవుతుందని పెంటగాన్ భయపడుతోంది.
ఫెలాన్ వెళ్ళిన గంటల్లోనే ట్రంప్ హంగ్ కావోను తెరపైకి తెచ్చారు. హంగ్ కావో ఒక మాజీ సైనికుడే కావచ్చు.. కానీ ఆయన ఇప్పుడు ట్రంప్ కు అత్యంత నమ్మకస్థుడు. పెంటగాన్ లోని సీనియర్ల అనుభవాన్ని పక్కన పెట్టి, కేవలం ట్రంప్ ఆర్డర్లను తూచా తప్పకుండా అమలు చేసే 'మిలిటరీ రోబో' లా హంగ్ కావోను ప్రొజెక్ట్ చేస్తున్నారు. హంగ్ కావో రాకతో ఇప్పుడు నేవీలో ఉన్న రూల్స్ అన్నీ మారిపోబోతున్నాయి. ఇరాన్ మీద 'ఆల్ అవుట్ వార్' కు అమెరికా నేవీని సిద్ధం చేయడమే హంగ్ కావోకు ట్రంప్ ఇచ్చిన అసలు టాస్క్.
హంగ్ కావో కేవలం తాత్కాలిక సెక్రటరీ మాత్రమే కాదు.. ఆయన ట్రంప్ ఆలోచనలకు రూపం కావడం తలనొప్పిగా మారింది. పెంటగాన్ లో ఉన్న సీనియర్ జనరల్స్ అందరూ 'ప్రోటోకాల్' మరియు 'లాజిక్' మాట్లాడుతుంటే, హంగ్ కావో మాత్రం 'యాక్షన్' అంటారు. అంటే, యుద్ధ రంగంలో అనుభవం కంటే తన మీద నమ్మకం ఉన్నవారికే ట్రంప్ పట్టం కడుతున్నారని అర్థం. హంగ్ కావో బాధ్యతలు చేపట్టిన వెంటనే హార్మూజ్ జలసంధిలోకి అమెరికా నౌకలను దూకుడుగా పంపాలని ఆదేశించారు.
ఇది జాన్ ఫెలాన్ భయపడినట్లుగా భారీ విధ్వంసానికి దారి తీయవచ్చు. ఒక్క నౌక మునిగినా.. అది అమెరికా పతనానికి ఆరంభం అవుతుంది. ఇది పెంటగాన్ లోని సిస్టమ్ ను లోపల నుంచే మార్చే వ్యూహం. అమెరికా తనలో తాను కొట్టుకుంటుంటే, ఇరాన్ టెహ్రాన్‌లో నవ్వుకుంటోంది. అగ్రరాజ్యం రక్షణ శాఖలో చీలిక వచ్చిందంటే అది శత్రువుకు ఇచ్చే అతిపెద్ద అవకాశం. ఇరాన్ తన హనీ ట్రాపింగ్ మరియు గూఢచారి వ్యవస్థతో ఈ చీలికలను మరింత పెంచి, అమెరికా నేవీని మానసికంగా దెబ్బతీసే ప్లాన్ చేస్తోంది.
నేవీ సెక్రటరీ మార్పు కేవలం ఒక వ్యక్తి మార్పు కాదు.. అది అమెరికా రక్షణ విధానంలో వచ్చిన అతిపెద్ద భూకంపం. ఒకవైపు ఇరాన్ తన ఐదు మారణాయుధాలతో సిద్ధంగా ఉంది.. మరోవైపు అమెరికా సైన్యంలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. సైన్యం మాట వినని దేశం ఏనాడూ బాగుపడలేదని చరిత్ర చెబుతోంది. మరి ట్రంప్ తీసుకున్న ఈ రిస్క్ అమెరికాను విజేతగా నిలుపుతుందా..? లేక సముద్ర గర్భంలో సమాధి చేస్తుందా..? హంగ్ కావో నేతృత్వంలో అమెరికా నౌకలు ఇరాన్ మందుపాతరలను ఎలా తట్టుకుంటాయి..? చూడాలి.