ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శీను వైసీపీ ను వదిలిపెట్టి టిడిపిలో చేరడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. వెన్నుముక లాంటి చిన్న శీను తను వదిలి వెళ్లిపోవడంపై బొత్స ఎక్కడపడితే అక్కడ కన్నీళ్లు పెట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ... లబోదిబోమంటున్నారు.కానీ ఓవరాల్ గా ఉత్తరాంధ్ర రాజకీయాలను... కొన్ని కుటుంబాల ఆధిపత్యాన్ని పరిశీలిస్తే చిన్న శీను టిడిపిలో చేరిక ఒక పథకం ప్రకారం జరిగిందా అని అనిపిస్తోంది. బొత్స సత్యనారాయణ పక్కా స్కెచ్ ప్రకారమే తన మేనల్లుడి నీ టిడిపిలోకి పంపారా...? తద్వారా రెండు పార్టీలపై తన కుటుంబ ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటున్నారా అనే అనుమానం రాక మానదు. జాగ్రత్తగా పరిశీలిస్తే శీను టిడిపిలో చేరడం వెనక బొత్స, మజ్జి కుటుంబాల మాస్టర్ ప్లాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.
బొత్స సత్యనారాయణ జనసేనలో చేరుతారని కొద్ది రోజులుగా బాగా నలుగుతున్న విషయం. కాపు సామాజిక వర్గానికి ప్రతినిధిగా బొత్స జనసేనలో చేరుతారని తద్వారా ఆ పార్టీని బలోపేతం చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే నిజానికి బొత్స కి వైసీపీలో జగన్ అన్ని రకాలుగా న్యాయం చేశారు. ఎమ్మెల్సీ ఇచ్చారు. మండలిలో ప్రతిపక్ష నేతనీ చేశారు. అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు. కానీ కౌన్సిల్లో మాత్రం, బొత్స కి అపోజిషన్ లీడర్ హోదా దక్కింది. అలాగే సత్తిబాబు కుమార్తె అనూష కి చీపురుపల్లి ఎమ్మెల్యే సీటు ఖాయం అయిపోయింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమెకి విజయనగరం జడ్పీ చైర్మన్ గా పోటీ చేసే అవకాశం కూడా దక్కనుంది. ఇక బొత్స కొడుకు సందీప్ కి విజయనగరం ఎంపీ సీటు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అన్ని రకాలుగా సత్తిబాబుని జగన్ బాగా చూసుకుంటున్నారు. అంతేగాక భవిష్యత్తులో సత్తిబాబు రాజ్యసభకి కూడా వెళ్లి ఆలోచన లో ఉన్నారు. రాజకీయాల్లో చివరి దశలో ఉన్నప్పుడు ప్రయోగాల అనవసరం అనుకొని, ఉన్నదానితో తృప్తి పడి జనసేన కి వెళ్లే ఆలోచనని బొత్స పూర్తిగా విరమించుకున్నారు.
బొత్స తో సమానంగా చిన్న శీను జిల్లాలో ఎదిగారు. మేనమామ కి రాజకీయంగా అండదండగా, వెన్నెముకగా వ్యవహరించారు. తెరపై బొత్స కనిపిస్తే తెర వెనక ఆటంతా మజ్జి సీనే ఆట ఆడిస్తారు. బొత్స ఆర్థిక వ్యవహారాలు కూడా చూసేది చిన్న శ్రీనే. శ్రీను రెండో భార్య కుమార్తె సహస్రానీ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు రెండు కుటుంబాల్లో నెక్స్ట్ జనరేషన్ కూడా పోటీ పడుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం విజయనగరం జిల్లాలో టిడిపి చాలా బలహీనంగా ఉంది. నాయకులైతే ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా దూకుడుగా వెళ్లే వాళ్ళు కాదు. కొండపల్లి శ్రీనివాస్ మినహా మిగిలిన వాళ్ళందరూ వృద్ధులైపోయారు. అశోక్ గజపతిరాజు రిటైర్ అయిపోయారు. కళా వెంకట్రావు కూడా వృద్ధులు అయిపోయారు.
సుజయ రంగారావు యాక్టివ్ గా లేరు. విజయనగరం టిడిపిలో స్పేస్ కచ్చితంగా కనిపిస్తుంది. అందుకే బొత్స చిన్న శ్రీనుని టిడిపి వైపు నెట్టారు. ఇది వ్యూహాత్మకంగా జరిగిన పరిణామమే. అంటే భవిష్యత్తులో బొత్స, మజ్జి కుటుంబాలు విజయనగరం జిల్లా రాజకీయాల్ని శాసిస్తాయి. బొత్స కుటుంబం వైసిపి లో ఉంటుంది, మజ్జి కుటుంబం టిడిపిలో డెవలప్ అవుతుంది. తద్వారా జిల్లా రాజకీయం మొత్తం ఈ రెండు కుటుంబాల కంట్రోల్లో ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో కూడా కొన్ని దశాబ్దాలుగా ఇవే అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అక్కడ కింజరాపు, ధర్మాన కుటుంబాలే రెండు పార్టీల్లో ఉండి జిల్లా రాజకీయాలను శాసిస్తున్నాయి. వాళ్లకే పదవులు వస్తాయి. వాళ్లే జిల్లా రాజకీయాన్ని రెండు పార్టీల్లో ఉండి సాసిస్తారు. కింజరాపు, ధర్మాన కుటుంబాలు రెండు వెలమ సామాజిక వర్గానికి చెందినవే.
అలాగే విజయనగరంలో బొత్స, మజ్జి రెండు కుటుంబాలు కాపు సామాజిక వర్గానికి చెందినవే. ఫైనల్ గా అధికారం రెండు కుటుంబాల్ని దాటి ఎక్కడికి వెళ్ళదు. ఇది బొత్స, చిన్న శీను కలిసి వేసిన మాస్టర్ ప్లాన్. అంతేకాక ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో చిన్న శ్రీను ఇరుక్కున్నాడు. కచ్చితంగా రేపో మాపో జైలుకెళ్తాడు. టిడిపిలో చేరిపోతే ఆ ముప్పు తప్పించుకోవచ్చు. ఆటోమేటిక్ గా కేసులోంచి బయటపడి పోతాడు. క్లీన్ చిట్ వచ్చేస్తుంది. ఇక చిన్న శ్రీను టిడిపిలో చేరగానే ఎమ్మెల్సీ అవుతాడు, మంత్రి పదవి కూడా రావచ్చు. కూతురు సహస్రకి విజయనగరం మేయర్ పదవి దక్కుతుంది. అంటే అధికార పార్టీలో ఉండొచ్చు. కేసులు ఉండవు. పదవులు కూడా దక్కుతాయి. ఎటు చూసినా చిన్న శ్రీనుకి ఇది అడ్వాంటేజ్. పార్టీ మారి చిన్న శీను సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడు .
అలాగే భవిష్యత్తులో బొత్స వైసీపీలో, శీను టిడిపిలో ఉంటారు కనుక ఎవరు అధికారంలోకి వచ్చినా మరొకరికి వేధింపులు ఉండవు. ప్రతీకార రాజకీయాలు , కేసులు ఉండవు. నువ్వు ఆ పార్టీ చూసుకో.... నేను ఈ పార్టీ చూసుకుంటా అనే పాలసీ పై రాజకీయం నడుస్తుంది. రెండు కుటుంబాలు ఒకే సీట్ కోసం ఒకే పార్టీలో యుద్ధం చేయడం కంటే పార్టీ మారిపోయి వేరువేరు సీట్లు దక్కించుకోవడం మంచిది. అప్పుడు ఇద్దరికీ రాజకీయ మనుగడ ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే బొత్స, శీను ని టిడిపిలోకి పంపించాడు. ఇద్దరూ చాలా కంఫర్ట్ గా... సేఫ్ గా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. బయట ప్రపంచానికి ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని... ఏదో జరిగిపోయింది అని ఒక భ్రమ కల్పించారు. ఫైనల్ గా ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ రెండు కుటుంబాలు, వాళ్ల కోటరీ సేఫ్ గా ఉంటాయి. కానీ ఇక్కడ ఎర్రి పప్పలు అయింది టిడిపి క్యాడర్ మాత్రమే. వైసీపీ క్యాడర్ ఎలాగూ బొత్స కే పనిచేస్తుంది. కాకపోతే టిడిపి వాళ్ళు మాత్రం నిన్న మొన్నటి వరకు చిన్న శీను పై రంకెలు వేసి.... ఇప్పుడు ఆయన కోసం పనిచేయాల్సి వస్తుంది. దట్ ఇస్ బొత్స. సత్తిబాబు స్కెచ్ చాలా ఉంటుంది మరి.