Top story: సంచలనం.. రేవంత్ కు డొనాల్డ్ ట్రంప్ థ్యాంక్స్…హైదరాబాద్ పై అమెరికా ప్రెసిడెంట్ క్రేజీ పోస్ట్..!

అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనం నమోదైంది. అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Post Published By: dialnews
Updated : 29 June 2026, 4:37 PM IST

అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనం నమోదైంది. అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అవును, మీరు విన్నది నిజమే. భాగ్యనగరం హైదరాబాద్‌లో ఒక ప్రధాన రహదారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం “డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ” అని పేరు పెట్టడంపై ట్రంప్ స్పందించారు. ఈ చారిత్రాత్మక గౌరవానికి ముగ్ధుడైన ట్రంప్, తన అఫీషియల్ సోషల్ మీడియా వేదికగా రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని అభినందిస్తూ థ్యాంక్స్ చెప్పారు. అసలు హైదరాబాద్‌లో ఈ రోడ్డు ఎక్కడుంది? ట్రంప్ ఏమని పోస్ట్ చేశారు? .

ముందుగా ఈ చారిత్రాత్మక ఘట్టం ఎలా జరిగిందో చూద్దాం. ఈ వారంలోనే హైదరాబాద్ నగరంలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. భారతదేశంలో ఉన్న అమెరికా రాయబారి సెర్గియో గోర్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంయుక్తంగా కలిసి నగరంలో ఒక సరికొత్త నామఫలకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని ఒక ప్రతిష్టాత్మక రహదారికి రేవంత్ రెడ్డి సర్కార్ “డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ”గా అధికారికంగా నామకరణం చేసింది. అమెరికా అధ్యక్షుడి పేరుతో భారతదేశంలో ఒక రోడ్డు ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక ఫొటోను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో స్వయంగా షేర్ చేసుకున్నారు.

“భారతదేశంలోని హైదరాబాద్‌లో కొత్త డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ ఏర్పాటయింది; ఈ తరహా అత్యున్నత గౌరవం పొందిన మొట్టమొదటి యూఎస్ ప్రెసిడెంట్‌ను నేనే. థ్యాంక్యూ” అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన నూతన ప్రయోగం ఇప్పుడు గ్లోబల్ లెవెల్‌లో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఈ ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ ఎక్కడ ఉందో, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? తెలంగాణ ప్రభుత్వం ఈ పేరును ఊరికే ఎంపిక చేయలేదు. హైదరాబాద్ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని సరికొత్త యూఎస్ కాన్సులేట్ కార్యాలయానికి ఇరువైపులా విస్తరించి ఉన్న ప్రధాన రహదారికి రేవంత్ సర్కార్ ఈ పేరును ఖరారు చేసింది.

నిత్యం వేలాది మంది ఐటీ ఉద్యోగులు, అంతర్జాతీయ ప్రతినిధులు తిరిగే అత్యంత విలాసవంతమైన ప్రాంతం ఇది. ఈ రోడ్డుకు కొద్ది దూరంలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, మరియు అమెజాన్ వంటి మల్టీనేషనల్ కంపెనీల రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆఫీసులు ఉన్నాయి. ఈ వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టడం వెనుక రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్ ఉందనే చర్చ నడుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఇది కేవలం ఒక అమెరికా అధ్యక్షుడికి ఇచ్చిన గౌరవం మాత్రమే కాదు.

అమెరికా దేశానికి, అక్కడి నూతన ప్రభుత్వానికి భారతదేశం మరియు తెలంగాణ రాష్ట్రం అందిస్తున్న ఒక మైత్రీపూర్వక గౌరవ వందనం. అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక సమీకరణాల్లో.. ముఖ్యంగా భారత్-యూఎస్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో హైదరాబాద్ నగరం ఎంతటి కీలకమైన పాత్ర పోషిస్తోందో చెప్పడానికి ఈ నిర్ణయమే ఒక బ్రాండ్ అంబాసిడర్ అని రేవంత్ సర్కార్ నిరూపించింది. ఈ ఒక్క నిర్ణయంతో అమెరికా పెట్టుబడులను మరింతగా హైదరాబాద్‌కు ఆకర్షించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ నోట హైదరాబాద్ పేరు, రేవంత్ సర్కార్ అభినందనలు వినబడడం నిజంగా తెలంగాణ ఐటీ రంగానికి ఒక పెద్ద మైలేజ్ అనే చెప్పాలి.

Published : 
  • 29 June 2026, 4:37 PM IST