Top story:ట్రంప్‌ మీద ఎటాక్‌కు ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ కారణం…!

ది ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌. ప్రపంచవ్యాప్తంగా మోస్ట్‌ హాట్‌ టాపిక్‌గా మారిన వ్యవహారం ఇది. ఇప్పుడు ఇదే.. ట్రంప్‌ మీద ఎటాక్‌కు కూడా కారణమయ్యింది.

Post Published By: dialnews
Updated : 24 February 2026, 9:30 PM IST

ది ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌. ప్రపంచవ్యాప్తంగా మోస్ట్‌ హాట్‌ టాపిక్‌గా మారిన వ్యవహారం ఇది. ఇప్పుడు ఇదే.. ట్రంప్‌ మీద ఎటాక్‌కు కూడా కారణమయ్యింది. రీసెంట్‌గా ట్రంప్‌ మీద జరిగిన ఎటాక్‌ వెనక ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారం ఉన్నట్టు సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నా అంత తోపు లేడు అన్నట్టు మాట్లాడే ట్రంప్‌ నోటి నుంచి.. నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు అనే మాట వచ్చింది అంటే.. ఈ వ్యవహారం ఎంత పీక్స్‌కు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.ట్రంప్‌ ప్రైవేట్‌ రిస్టార్‌లోకి ఓ అగంతకుడు చొరబడటానికి కారణం ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ అని నిర్ధారించారు సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్స్‌.

ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించారు. తన రిసార్ట్‌ దగ్గర ఉన్న భద్రతాలోపంపై భయాన్ని వ్యంగ్యంతో కవర్‌ చేశారు ట్రంప్‌. ఈ ఇష్యూపై ట్రంప్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. వైట్ హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్.. ‘‘నేను ఇంకా ఎంతకాలం జీవించి ఉంటానో నాకు తెలియదు. నా కోసం తుపాకులు పట్టుకుని ఎంతమంది వేచి చూస్తున్నారో చూశారుగా ?’’ అంటూ కామెంట్స్‌ చేశారు. గొప్ప నాయకులకే ఇలాంటి ముప్పు ఉంటుందని, అబ్రహం లింకన్, కెన్నడీ వంటి ‘ప్రభావశీల’ అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుంటారని గుర్తుచేశారు. ‘‘బహుశా నేను కొంచెం తక్కువ ప్రభావశీల నాయకుడిగా ఉంటే బాగుండేదేమో.. కాసేపు సాధారణ అధ్యక్షుడిలా ఉందాం’’ అని భయం బయటికి కనిపించకుండా కామెంట్స్‌ చేశారు.

ఫిబ్రవరి 22 తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ఆస్టిన్ టక్కర్ మార్టిన్ అనే యువకుడు షాట్‌ గన్, ఇంధనం క్యాన్‌తో మార్-ఎ-లాగో ప్రహరీని దాటేందుకు ప్రయత్నించాడు. ఇది ట్రంప్‌ ప్రైవేట్‌ రిసార్ట్‌. భద్రతా దళాలు హెచ్చరించినప్పటికీ, అతడు లొంగకుండా తుపాకీని ఎక్కుపెట్టడంతో.. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మార్టిన్ అక్కడికక్కడే మరణించాడు. నేరుగా అధ్యక్షుడి రిసార్ట్‌లోకి చొరబడేందుకు ఇలా దుండగుడు ప్రయత్నించడంతో ఈ ఇష్యూ వైరల్‌ అయ్యింది.

ట్రంప్‌ మీద ఎటాక్‌ జరగడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఎన్నికల క్యాంపెయిన్‌ సమయంలో కూడా ట్రంప్‌ మీద కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ట్రంప్‌ చెవికి గాయం కూడా అయ్యింది. ట్రంప్‌ దంపతులు వైట్‌హౌజ్‌లో ఉన్న సమయంలో కూడా ఆయన మీద ఎటాక్‌ చేసే ప్రయత్నం జరిగింది. తాజా ఘటనలో చనిపోయిన యువకుడు ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదలకు సంబంధించి ప్రభుత్వంపై అసహనంతో ఉన్నట్లు కొన్ని మెసేజ్‌ల ద్వారా వెల్లడైంది. దీంతో ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

 

Published : 
  • 24 February 2026, 9:30 PM IST