నేనేం మాట్లాడినా జనం వెర్రి బాగుల వాళ్ళలా చూసి చస్తారు. నేను ప్రవచనం చెప్తే నోరెళ్ల బెట్టి వింటారు.
నేను ఎవరిని ఏదైనా కామెంట్ చేస్తాను. ఎవర్ని ఎంతమాటైనా అంటాను. ఇది ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఓవరాక్షన్. ఆడపిల్లల వస్త్రధారణ పై గతంలో ఒకసారి నోరు పారేసుకున్నాడు గరికపాటి. వందల మంది ఉన్న సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి గురించి మాట తూలి ఆ తర్వాత నాలిక కరుచుకున్నాడు.ఇలా ఒకటి రెండు సార్లు కాదు చాలాసార్లు తన నోటి తీటతో వివాదాలు ఇరుక్కుంటూనే ఉన్నాడు గరికపాటి.
భాష, సంస్కృతి, మతంపై ప్రవచనం చెప్తానంటూ నాలుగు కుళ్ళు జోకులు పేల్చి సన్మానాలు చేయించుకునే గరికపాటి నరసింహారావు... మరోసారి నోరు జారాడు. స్కూల్ పిల్లలు.... ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల పట్ల ఆయన మనసులో ఎంత చులకన భావం ఉందో బయట పెట్టుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనం మీధ్యాన్నం అంటూ వెకిలి ప్రేలాపన పేలాడు. స్కూల్లో పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టడం ఏమిటి,? పైగా కోడిగుడ్లు తినిపించడం ఏంటి? అవి తిని శోభనం పెళ్ళికొడుకుల్లా మంచాలు ఎక్కి కూర్చుంటారు. వాళ్లకి తిండి పెడితే చదువులు ఎలా వస్తాయి? ఎవడి తిండి వాడు స్కూలుకి తెచ్చుకోవాలి.... అంటూ గవర్నమెంట్ స్కూలు పిల్లల పేదరికాన్ని వెక్కిరిస్తూ గరికపాటి మాట్లాడిన మాటల పై అన్ని చోట్ల నుంచి విమర్శలు వస్తున్నాయి.
గరికపాటి అనేవాడు నాలుగు ప్రాస పదాలు పట్టుకుని పదిమందిని నవ్విస్తూ సన్మానాలు చేయించుకుంటూ, గండపెండరాలు తొడిగించుకునే వాడే తప్ప, ఈ దేశం... ఇక్కడి సామాజిక పరిస్థితులు... ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లల స్థితిగతులు, అంతర్జాతీయంగా వరల్డ్ బ్యాంకు, యూనిసెఫ్ లాంటి సంస్థలు రూపొందించిన విధానాలు, ఇవేమీ తెలియని అక్కుపక్షి గరికపాటి నరసింహారావు అనేది స్పష్టంగా జనానికి అర్థమైంది.ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం అనేది ఒక్క భారతదేశంలోనూ.... తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే జరగడం లేదు. అమెరికా... యూరప్ దేశాల్లో ఎప్పటినుంచో మధ్యాహ్న భోజనం స్కూల్ లోనే పెడతారు.
అభివృద్ధి చెందిన ఆ దేశాల్లో కూడా స్కూల్లోనే పిల్లలకు భోజనం ఎందుకు పెడుతున్నారు? ఇక ఇంటర్నేషనల్ స్కూల్స్..కూడా పిల్లలకు మధ్యాహ్నం పూట భోజనం బడి లోనే పెడతారు. ఇదంతా ఎందుకంటే పిల్లలకు పౌష్టికాహారం ఉండాలని... పేదరికం వల్ల తల్లిదండ్రులు అంత మంచి ఆహారం పెట్టలేకపోతున్నారని, అంతేకాక తిండికి లేని కుటుంబాలు పిల్లల్ని స్కూలుకు పంపలేక బాల కార్మికులుగా మార్చేస్తున్నారని.... స్కూల్లోనే మధ్యాహ్న భోజనం పిల్లలకు పౌష్టిక ఆహారం ఇవ్వడం, స్కూల్ పై ఆసక్తి పెంచడం, తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించడం ఇలాంటి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో ఏనాడో మధ్యాహ్న భోజనం ప్రారంభించారు.
అంతకంటే ముందే తమిళనాడులో మధ్యాహ్న భోజన పథకం ఉంది. ఇప్పుడు దేశమంతా అమలవుతోంది. లెక్చరర్ గా పనిచేసే కూడాఇవేమీ తెలియని ఓవరాక్షన్ గరికపాటి పిల్లలను కించపరుస్తూ... వెకిలిగా వాళ్లకి గుడ్డు అవసరమా...? తిండి పెడితే చదువుతారా? శోభనం పెళ్ళికొడుకుల్లా మంచాలు ఎక్కుతారు ....ఇలాంటి అతిప్రాలాపన పేలి... తన అవివేకాన్ని... కుల అహంకారాన్ని... జ్ఞానాంధకారాన్ని బయట పెట్టుకున్నాడు.టీవీ చానల్స్... ఆ తర్వాత యూట్యూబ్ రివల్యూషన్ వచ్చిన తర్వాత గరికపాటి లాంటి ప్రవచనకర్తలకి సమాజంలో స్టార్ హోదా వచ్చేసింది. టీవీలు , యూట్యూబ్ లు లేకముందు గరికపాటి ఎవడో ఎవ్వడికి తెలియదు. పదో ... పరకో
ఎవరైనా ఇస్తే గుడి దగ్గర భాగవతం మహాభారతం గురించి వ్యాఖ్యానాలు చెప్పే గరికపాటి లాంటి వాళ్లకి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల స్థితిగతుల గురించి ఏం తెలుస్తాయి? ఒక్కపూట అన్నం ,వాళ్ల జీవితంలో ఎంత మార్పు తీసుకొస్తుందో ఇలాంటి కుహనా మేధావులకి ఏం అర్థం అవుతుంది? ఈ అహంకార మేధావి కి ఎవరో ఇచ్చిన బంగారు కంకణాలు... గండ పిండెరాలు... బిరుదులు, బహుశా సామాన్యుల జీవితాల గురించి ఆలోచించే స్థాయి నీ దాటించేసేయ్.ఒక పిల్లాడికి రోజుకి స్కూల్లో మధ్యాహ్న భోజనం పెడితే అయ్యే ఖర్చు నాలుగు నుంచి ఐదు రూపాయలు.
అది కూడా స్కూలు ఉన్న రోజుల్లోనే భోజనం పెడతారు. స్కూల్ లేనప్పుడు ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి పిల్లలు తింటారు. బడిలో భోజనం చేయడం వల్ల పిల్లలకు పౌష్టికాహారం లభించడమే కాక, సామాజిక జీవితం కూడా అలవాటు అవుతుంది. గరికపాటి వారు రోజు తిన్నట్లు కంచం నిండా వేడి అన్నం పెట్టుకొని, నెయ్యి పప్పు వేసుకొని, నాలుగైదు రకాల కూరలు పెట్టుకొని, సాంబారు జుర్రుకుంటూ.... గడ్డ పెరుగు... ఆవకాయ పచ్చడి తో స్కూల్లో అన్నం పెట్టరు. చాలా లిమిటెడ్ గా పిల్లలకు పౌష్టికాహారం ఎంత అవసరమో అంత పెడతారు. బహుశా గరికపాటి అది కూడా సహించలేకపోతున్నట్టు ఉన్నారు.
పిల్లలకు పెట్టే మధ్యాహ్నం భోజనం పై పడి ఏడుస్తున్నారు. ఆ ప్రవచనాలు చెప్పినందుకుl ఆయనకు సన్మానాలు ఎందుకు చేయాలి? గండ పిండేరాలు ఎందుకు తొడగాలి? పద్మశ్రీలు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తే గరికపాటి దగ్గర సమాధానం ఉందా? మరి స్కూలు పిల్లల మధ్యాహ్నం భోజనం గురించి ఆయనకెందుకు?కేవలం టీవీలో... యూట్యూబ్ ఛానల్ లో ప్రసంగాలు ప్రవచనాలు వల్ల వచ్చిన పాపులారిటీని అడ్డం పెట్టుకొని ఇవాళ గరికపాటి నరసింహారావు రెండు చేతుల సంపాదిస్తున్నారు. ప్రధాని మోడీ భజన చేసి బిజెపి సహకారంతో పద్మశ్రీ సంపాదించుకున్నారు. ప్రభుత్వాలు తనని ఇంకా గుర్తించలేదని అడపాదడపా నాయకులు పై ఏడుస్తూనే ఉంటారు. ఈ అహంకార కుహనా మేధావి ఆమధ్య ఇలాగే చిరంజీవిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తన్నులు తినే పరిస్థితి తెచ్చుకున్నాడు.
ఎవరిపై పడితే అలా.... ఇష్టం వచ్చినట్లు మాట్లాడే గరికపాటి... ఒక్కరోజు ఒక నాలుగు కిలోమీటర్ల రిక్షా తొక్కితే కష్టం విలువ ఏంటో తెలిసి వస్తుంది. ఎండలో తాపీ పని చేస్తే పేదవాడి బతుకు ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఈ దేశంలో పూట గతి లేని వాళ్ళు కోట్లలో ఉన్నారని, వాళ్ల పిల్లల చదువులు కోసం ప్రభుత్వం స్కూల్లో మధ్యాహ్న భోజనం పెడుతుందని కనీస అవగాహన ఉంటే గరికపాటి నరసింహారావు ఇలాంటి మాటలు మాట్లాడేవాడు కాదు. భవిష్యత్తులో ఇలాంటి ప్రేలాపనలు పేలకుండా... పేదరికాన్ని వెక్కిరించకుండా ఉండాలంటే గరికపాటి పద్మశ్రీని కేంద్రం వెనక్కి తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.
చేస్తున్నారు.