బ్రేకింగ్: ఫ్లైట్ క్రాష్, డిప్యూటి సిఎం మృతి..!

మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2026 | 10:19 AMLast Updated on: Jan 28, 2026 | 10:19 AM

In A Tragic Plane Crash That Occurred In Maharashtra The States Deputy Chief Minister Ajit Pawar Lost His Life

మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. పూణే జిల్లాలో ఉన్న బారామతిలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళే సమయంలో, బారామతి విమానాశ్రయంలో విమానం కూలిపోయింది. ముంబైకి చెందిన వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ విమానంలో ముంబై నుంచి బారామతి బయల్దేరి వెళ్ళారు అజిత్ పవార్.

విమానంలో ఆయనతో పాటుగా మొత్తం అయిదుగురు ఉన్నట్లుగా చెప్తున్నారు. భారీ మంటలు చెలరేగి విమానం కాలి బూడిద అయింది. అజిత్ పవార్ మృతిని డీజీసీఏ అధికారులు ధ్రువీకరించారు. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్టు అధికారులు తెలిపారు.